ETV Bharat / state

ఆకస్మాత్తుగా కుంగిన రోడ్డు.. తప్పిన పెను ప్రమాదం

Road damage in Hyderabad: హైదరాబాద్​లో ఆకస్తాత్తుగా రహదారి కుంగిపోయింది. నగరంలోని సైదాబాద్ - సంతోశ్​నగర్ ప్రధాన రహదారిలో ఒక్కసారిగా భారీ గుంత ఏర్పడింది. అయితే ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Road damage
సైదాబాద్ - సంతోశ్​నగర్ ప్రధాన రహదారి
author img

By

Published : Mar 17, 2022, 10:16 PM IST

Road damage in Hyderabad: హైదరాబాద్​లోని సైదాబాద్ - సంతోశ్​నగర్ ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో రహదారి మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. అదే సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సంతోశ్​నగర్‌ నుంచి ఐఎస్​సదన్‌ చౌరస్తా వెళ్లే రహదారిపై ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గుంతలు తీసి వదిలేశారు. దీంతో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాలు సాఫీగా వెళ్లేందుకు దోహదపడ్డారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.