ETV Bharat / state

Subcommittee meet on House sites: ' మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక'

author img

By

Published : Jan 6, 2022, 3:48 PM IST

Subcommittee meet on House sites: పేదల ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్ధీకరణ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేటీఆర్​ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.

Subcommittee meet on House sites
కేటీఆర్

Subcommittee meet on House sites: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. ఇళ్ల స్థలాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

58, 59 జీఓ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, పెండింగ్​లో ఉన్న వాటిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంలో మరింత కసరత్తు చేశాక సీఎం కేసీఆర్​కు నివేదిక అందించనుంది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.