ETV Bharat / state

రిజిస్ట్రేషన్లు బంద్... అక్రమ లేఔట్లకు కత్తెర - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తాజా వార్త

అనుమతి లేకుండా భవనాలు, ఇళ్ల స్థలాలు కొన్న వారికి సబ్​రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. పురపాలక శాఖ మంత్రి ఆదేశానుసారం, మున్సిపల్​ కమిషనర్ల లేఖల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. అక్రమ లేఔట్లను నిలువరించేందుకు ఇది ఓ మంచి తరుణం అని ప్రజలు భావిస్తున్నారు.

sub-registrars-refusal-of-registrations-of-illegal-layouts-in-telangana-state
అక్రమ లేఅవుట్లకు కత్తెర
author img

By

Published : Mar 1, 2020, 6:33 AM IST

Updated : Mar 1, 2020, 8:15 AM IST

రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో అక్రమ లేఔట్ల స్థలాలు, భవనాలకు రిజిస్ట్రేషన్​లు నిలిపివేశారు. కమిషనర్ల లేఖల ఆధారంగా సబ్​ రిజిస్ట్రార్లు తక్షణమే అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 30 మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. కమిషనర్ల నుంచి లేఖలు అందిన వెంటనే మిగిలిన చోట్లా అమలు చేయనున్నారు. దీని వల్ల అక్రమ లేఔట్ల్​లు- అనధికారిక భవన నిర్మాణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

లేఖలు రాశారు

కొత్త మున్సిపల్​ చట్ట ప్రకారం పురపాలక సంఘాల పరిధిలో అనుమతి లేకుండా వేసిన వెంచర్లలో స్థలాలను అనధికారిక భవనాలను రిజిస్ట్రేషన్​ చేయకూడదు. పక్కాగా నిషేధం అమలు చేయాలి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కూడా ఈ విషయంలో కఠినంగా ఉండమని కమిషనర్లను కోరారు. దానితో కొంతమంది ఫిబ్రవరి 22 నుంచే రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్​ అధికారులకు లేఖలు రాశారు. 'మా పట్టణ పరిధిలో ఫలానా ఏరియాలో అక్రమ లేఔట్ల్ ఉంది. ఫలానా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేశారు. సంబంధిత సర్వే నంబరులో ఇళ్లు, స్థలాలు రిజిస్టర్​ చేయొద్దు' అని అందులో స్పష్టంగా పేర్కొంటున్నారు.

ఇలా లేఖలు అందుకున్న అనేకమంది సబ్​రిజిస్ట్రార్లు తక్షణం ఆచరణలో పెట్టారు. కొంతమంది స్థానిక నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నా ఎంతో స్థిరంగా ఉంటున్నారని తెలిసింది. మున్సిపల్​ చట్టంలో ఉన్న విధంగానే తాము వ్యవహరిస్తున్నామని రిజిస్ట్రేషన్​ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఎన్నెన్ని అక్రమ లేఔట్​లో..

రాష్ట్రంలోని అనేక పురపాలక సంఘాల పరిధిలో వందలాది అక్రమ లేఔట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల వేలాదిగా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి. గత నెల వరకు ఈ నిర్మాణాలకు, స్థలాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తాజాగా ఆగిపోవడం వల్ల అక్రమ లేఔట్లలో ఇళ్లు, స్థలాలను కొన్న వేలాది మంది లబోదిబోమంటున్నారు.

ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్

Last Updated : Mar 1, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.