ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 22న విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. కోపంలో 18 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని (TCs to Students) కోరారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నయీం.. తల్లిదండ్రుల వద్ద నుంచి లిఖితపూర్వకంగా లేఖ రాయించుకొని పిల్లలందరికీ టీసీలు(TCs to Students) ఇచ్చి పంపంచారు.
ఏదో ఆవేశంలో టీసీలు (TCs to Students) ఇవ్వాలని కోరగానే.. టీసీ(TCs to Students)లు ఇవ్వడం ఏం బాగాలేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నచ్చజెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే పిల్లలను పంపించివేయడం సరికాదన్నారు. తల్లిదండ్రుల సమావేశం అని చెప్పి.. ఎన్నికలు నిర్వహించారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు నయీంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: Jaggareddy: రేవంత్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌కి కారణమేంటి?