ETV Bharat / state

బైడెన్‌ రాక.. విద్యార్థులకు సానుకూల వాతావరణం

అమెరికా విద్యకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మళ్లీ ఉత్సుకత చూపుతున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో ఆగిపోయిన వారితోపాటు త్వరలో ఇక్కడ చదువు పూర్తికానున్న విద్యార్థులు అమెరికా చదువులకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది కన్సల్టెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా కాన్సులేట్‌ సైతం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తదితర సంస్థలతో కలిసి వెబినార్లు నిర్వహిస్తోంది.

america
బైడెన్‌ రాక.. విద్యార్థులకు సానుకూల వాతావరణం
author img

By

Published : Feb 18, 2021, 8:29 AM IST

అమెరికాలో ఫాల్‌ సీజన్‌ కింద ఆగస్టులో తరగతులు మొదలవుతాయి. కొన్ని నవంబరు నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తుంటాయి. ఈ ప్రక్రియ వచ్చే మే నెల వరకు కొనసాగుతుంది. గత ఏడాది వెళ్లాల్సిన వారు కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. కొందరు ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు పొందారు. కరోనా నేపథ్యంలో కొన్ని యూనివర్శిటీలు ఈసారి జీఆర్‌ఈ స్కోరు లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొందరు విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, యూరప్‌ దేశాల వైపు చూస్తున్నారని కన్సల్టెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు.

25 శాతం పెరిగిన ట్రాన్స్‌స్క్రిప్టులు

రెండు రాష్ట్రాల్లో.. ట్రాన్స్‌స్క్రిప్టులు తీసుకునే వారి సంఖ్య 25-30 శాతం పెరిగిందని జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థి 5-10 వర్సిటీలకు దరఖాస్తు చేస్తుంటారు. దరఖాస్తుకు ఒరిజినల్‌ మార్కుల ధ్రువపత్రాలను పొందుపరచలేరు కాబట్టి రిజిస్ట్రార్‌, పరీక్షల విభాగం అధికారులు సంతకం చేసిన ట్రాన్స్‌స్క్రిప్టులను విద్యార్థులు ఆయా వర్సిటీల నుంచి తీసుకుంటారు. వీటి కోసం ఇప్పటివరకు 7,000 మంది దరఖాస్తు చేశారని జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల కంట్రోలర్‌ వెంకటరెడ్డి చెప్పారు. ఒక్కో విద్యార్థి 10-15 తీసుకుంటున్నారని, గత ఏడాది కంటే 25 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ నుంచి గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి 15 వరకు 4,745 మంది బీటెక్‌ విద్యార్థులు, 186 మంది బీఫార్మసీ విద్యార్థులు ట్రాన్స్‌స్క్రిప్టులు పొందారు. వివిధ విదేశీ వర్సిటీలకు దరఖాస్తు చేసుకోగా తనిఖీ కోసం థర్డ్‌ పార్టీ ఏజెన్సీ అయిన వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నుంచి తమకు 2,533 సర్టిఫికెట్లు వచ్చాయని పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య కామాక్షిప్రసాద్‌ చెప్పారు.

అమెరికాలో రెండు లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా తెలంగాణ నుంచి కనీసం 15,000 మంది, ఏపీ నుంచి 10,000 మంది వెళ్తుంటారని అంచనా. వారిలో హైదరాబాద్‌ నుంచే సుమారు 10,000 మందికిపైగా వెళ్తున్నారు. ఎక్కువమంది స్టెమ్‌ కోర్సులను ఎంచుకుంటున్నారు. అంటే సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం కోర్సులను చదువుతున్నారు. మన దేశంలో ఒకే నగరం నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్యలో హైదరాబాద్‌దే ప్రథమ స్థానం.

వివరాలిలా...

సానుకూల వాతావరణం

-అజయ్‌కుమార్‌, సంచాలకుడు, ఐఎంఎఫ్‌ఎస్‌ కన్సల్టెన్సీ

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉన్నప్పుడు ఎప్పుడు తమకు నష్టం చేసే నిర్ణయం తీసుకుంటారోనన్న భయం వెంటాడేది. ఇప్పుడు జోబైడెన్‌ రాకతో సానుకూల వాతావరణం ఏర్పడిందని విద్యార్థులు భావిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి వేగంగా కోలుకుంటుండటంతో ఇప్పుడు వెళితే చదువు పూర్తయ్యే రెండేళ్లలో కొలువులు దక్కుతాయని వారు అంచనా వేస్తున్నారు.

8 వర్సిటీలకు దరఖాస్తు చేశా

-వంగీపురపు రుగ్వేద, బీటెక్‌ చివరి ఏడాది, జేఎన్‌టీయూహెచ్‌

అమెరికాలోని టాప్‌-50 వర్సిటీల్లో ఎనిమిదింటికి దరఖాస్తు చేశాను. ఏప్రిల్‌ లోపు ఫలితం చెబుతారు. వచ్చే ఆగస్టు/సెప్టెంబరు నాటికి బీటెక్‌ సీఎస్‌ఈ చివరి సెమిస్టర్‌ పూర్తవుతుంది. నేను అయిదు సెమిస్టర్ల ఫలితాలతోనే దరఖాస్తు చేశాను. మా బ్రాంచీలో నాకు తెలిసి అయిదారుగురు అమెరికా విద్యకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సీనియర్లతో పోటీ ఎక్కువైంది

-సూర్య రోషన్‌, హైదరాబాద్‌

నేను హైదరాబాద్‌లో బీటెక్‌ సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతున్నాను. టాప్‌ 10-60 మధ్య ర్యాంకింగ్‌లో ఉన్న 9 వర్సిటీలకు దరఖాస్తు చేశాను. ప్రవేశాలకు అనుమతి ఇస్తే జూన్‌ నాటికి ఐ-20 ఫారమ్‌ పంపిస్తారు. గత ఏడాది కరోనాతో ఆగిపోయిన సీనియర్లు ఏడాది ఉద్యోగ అనుభవంతో దరఖాస్తు చేస్తుండటంతో మాకు పోటీ అధికమైంది. ముఖ్యంగా ప్రముఖ వర్సిటీల్లో సీట్లు రావడం కొంత సమస్యే. పీజీ అమెరికాలోని మంచి వర్సిటీల్లో చేస్తే కెరీర్‌ బాగుంటుందని సీనియర్లు, మరికొంతమంది నిపుణులు చెప్పడంతో అమెరికా విద్యపై ఆసక్తి పెంచుకున్నా.

గతేడాది కరోనా కారణంగా వెళ్లలేదు

గతేడాది న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంఎస్‌ సీటు వచ్చింది. కరోనా తీవ్రంగా ఉండటంతో ఈ ఏడాదికి వాయిదా వేసుకున్నాను. అప్పుడు వచ్చిన ప్రవేశంతోనే ఇప్పుడు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.-కుసుమ నవీలక్ష్మీ, విజయవాడ

విద్యార్థులూ.. ఈ తప్పులు చేయొద్దు

అమెరికాలో సుమారు 4,500 వరకు ప్రభుత్వ (పబ్లిక్‌ అని పిలుస్తారు), ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిని ర్యాంకింగ్‌ల ఆధారంగా టైర్‌- 1, 2, 3లుగా వర్గీకరిస్తారు. వాస్తవానికి టైర్‌-1, 2ల్లో 500కు మించి ఉండవు. అక్కడి ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు ఆయా విద్యాసంస్థలకు ర్యాంకింగ్‌లు, అక్రిడేషన్లు ఇస్తుంటాయి. అయితే ప్రభుత్వ వర్సిటీలు నాణ్యమైనవి.. ప్రైవేటువి నాసిరకమైనవి అని చెప్పలేం. కొన్ని స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తే.. మరికొన్ని చేయవు. వీటన్నింటిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయా వర్సిటీల వెబ్‌సైట్లను, యూఎస్‌ కాన్సులేట్‌ వెబ్‌సైట్లను పరిశీలిస్తే అవగాహన ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.