ETV Bharat / state

హెచ్​సీయూలో ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్వల్ప ఉద్రిక్తత.. - హైదరాబాద్​ తాజా వార్తలు

Tension at HCU: హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో విద్యార్థులు చేసిన ధర్నా కాసేపు ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీ అధికారులు.. కామన్​ ఎంట్రెన్స్​​ టెస్ట్​ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేయడం, రాష్ట్రంలో చేపట్టిన పోటీ పరీక్షల తేదీ, యూనివర్సిటీ పీహెచ్​డీ ఎంట్రెన్స్​ టెస్ట్​ ఒకే రోజు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు.

Students are worried
Students are worried
author img

By

Published : Sep 24, 2022, 12:29 PM IST

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన.. కాసేపు ఉద్రిక్తత

Tension at HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వైస్ ఛాన్స్​లర్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఒకే దేశం-ఒకే పరీక్ష పేరుతో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

దీంతోపాటే రాష్ట్రంలో చేపట్టిన వివిధ పోటీ పరీక్షల తేదీ.. యూనివర్సిటీ పీహెచ్​డీ ఎంట్రెన్స్ టెస్ట్ ఒకే రోజు నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు నష్టపోతారని పీహెచ్​డీ పరీక్ష తేదీని మార్చాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులను వైస్ ఛాన్స్​లర్ కార్యాలయం నుంచి తరలించడానికి వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించగా.. కాసేపు తోపలాట జరిగి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అయినా విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ క్వాలిఫై ఫీజు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.