ETV Bharat / state

ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్​ తార్నాకలోని ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట.. పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. వైస్ ఛాన్సలర్​ను తక్షణమే తొలిగించాలి డిమాండ్ చేశాయి.

Student unions protest in front of eflu university in hyderabad
ఇఫ్లూ యూనివర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
author img

By

Published : Mar 21, 2021, 12:44 PM IST

హైదరాబాద్​ తార్నాకలోని ఇఫ్లూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. సురేశ్​ను వెంటనే విధుల్లోంచి తొలిగించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. యూజీసీ నిబంధనల మేరకు వసతి గృహలు ఇప్పటికే తెరుచుకోవాల్సి ఉన్నా.. తెరవకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. హాస్టల్స్​ను వెంటనే తెరవాలని డిమాండ్​ చేస్తూ.. ఇఫ్లూ ఎదుట ధర్నా చేపట్టాయి.

యూనివర్సిటీలో ఇటీవల జరిగిన టీచర్ రిక్రూట్మెంట్​లో జరిగిన అవకతవకలు బహిర్గతం కాకుండా ఉండటానికే హాస్టళ్లను​ తెరవకుండా అడ్డుపడుతున్నారని.. సంఘాల నేతలు ఆరోపించారు. వసతి గృహాలను వెంటనే తెరిచి విద్యార్థులకు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో.. ఏఐఎస్​ఎఫ్​ కార్యదర్శి శ్రీను, ఎస్​ఎఫ్​ఐ కార్యదర్శి రవి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి నరేశ్​తో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రజలకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది: మల్లన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.