మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అమాయక ప్రజలను మోసం చేస్తూ ఏటీఎం కేంద్రాల వద్ద చోరీలకు పాల్పడుతున్న శివకుమార్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శివకుమార్‌ని ఇంజినీరింగ్ చదివేందుకు తన తల్లిదండ్రులు ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని ఓ కళాశాలలో చేర్పించారు.
ఉత్తమ విద్యార్థిగా ఉన్న అతను జల్సాలకు అలవాటు అయ్యి తల్లిదండ్రులు పంపే డబ్బు సరిపోక చోరీలకు పాల్పడుతున్నాడు. ఈనెల 3వ తేదీన నారపల్లి వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మల్లారెడ్డి అనే వ్యక్తికి డబ్బులు డ్రా చేసి ఇస్తానని చెప్పి రూ.4వేలతో పారిపోయాడు. మరో వ్యక్తినీ ఇలాగే మోసగించాడు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘట్‌కేసర్‌లోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి 14వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ