ETV Bharat / state

Student Suicide In Hyderabad : కళాశాల భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. అదే కారణమా?

Student Commits Suicide In Hyderabad : ఈరోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలను ఎక్కువ చూస్తున్నాం. ప్రతి చిన్న విషయానికి మరణమే శరణ్యం అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది. తాజాగా హైదరాబాద్​లో పదో తరగతి పాసై ఇంటర్​ చదవడానికి విద్యార్థిని ప్రముఖ కళాశాలలో జాయిన్​ చేశారు తన తల్లిదండ్రులు. అప్పటివరకు ఉన్న స్నేహితులు, ఇంట్లో వారు లేరనే లోటుతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Student Suicide
Student Suicide
author img

By

Published : Jun 13, 2023, 4:25 PM IST

Inter Student Suicide In Hyderabad : అప్పటివరకు స్నేహితులతో ఆడుతూపాడుతూ.. ఎంతో ఆనందంగా గడిచిపోతున్న విద్యార్థిని జీవితంలో ఒకేసారి పెద్ద కుదుపు వచ్చింది. అదే పదో తరగతి చదువు అయిపోయి.. ఇంకా ఇంటర్​ మీడియట్​లో జాయిన్​ అవ్వాలి. అదీ కూడా ఇంటర్​ చదువులంటే తనకు నచ్చిన కళాశాలలో కాకుండా.. ఒక ప్రముఖ విద్యాసంస్థలో తన తల్లిదండ్రులు చేర్పించారు. కళాశాలలో జాయిన్​ చేసిన దగ్గర నుంచి.. ఎప్పుడు ఇంటికి వెళ్లడానికి సెలవులు ఇస్తారని ఎదురు చూసేది. ఇదే బెంగ ఆమె మనసు ఉండి.. తల్లిదండ్రులను, స్నేహితులను వదిలి వచ్చాను అనే బాధతో ఒక్కసారిగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని.. బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిసరాలను పరిశీలించారు.

Student Suicide In Hyderabad : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన రాగుల వంశిత(16)ను వారం రోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్​లోని బాచుపల్లి నారాయణ కళాశాలలో చేర్పించారు. ఆమె ఆ కళాశాలలో ఇంటర్​ మొదటి ఏడాది ఎంపీసీ కోర్సులో జాయిన్​ అయ్యింది. తన తల్లిదండ్రులు నారాయణ కాలేజ్​ వసతిగృహంలో చేర్పించి.. జాగ్రత్తలు చెప్పి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్లిన దగ్గర నుంచి వంశిత ఎప్పుడు కాలేజ్​కు సెలవులు ఇస్తారని ఆలోచిస్తూ.. ఫ్రెండ్స్​ను ఈ విషయంపై ఎప్పుడూ అడుగుతూ ఉండేదని వారు చెప్పారు. తల్లిదండ్రులు ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారన్న బాధతో.. ఇంటి దగ్గర వారిని మిస్​ అవుతున్నానన్న బాధతో ఎప్పుడూ ఉండేదని తోటి స్నేహితులు తెలిపారు. సరిగ్గా వారం రోజులు వసతిగృహంలో ఉన్న యువతి.. ఉదయం భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Student Died Jumping From Hostel building : దీంతో వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విద్యార్థిని మృతిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి.. వంశిత బిల్డింగ్​ పై నుంచి దూకిందా? ఇవే కాకుండా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కళాశాల వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు.. కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థిని మృతిపట్ల రోడ్డుపై బైఠాయించి.. ధర్నా నిర్వహించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.