హైదరాబాద్‌లోని మెట్టుగూడలో పిచ్చికుక్కలు(street dogs) స్వైర విహారం చేస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే ఏడుగురు పిల్లలపై దాడి(dog bites) చేశాయి. బయట ఆడుకుంటున్న చిన్నారులపై శునకాలు ఒక్కసారిగా దాడి చేయగా... పిల్లల కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
స్థానికులు వాటిని వెళ్లగొట్టే క్రమంలో ఒక కుక్క మృతి చెందగా... మిగిలిన రెండింటిని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయని స్థానికులు వాపోయారు. బయటకు రావాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ సిబ్బంది స్పందించి... కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: accident: మణుగూరు ఓపెన్‌కాస్ట్-2లో ప్రమాదం.. ముగ్గురు మృతి