కరోనా కొత్త రకం స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి రాష్ట్రానికి 1,200 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్లో ఉంచుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9 నుంచి యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదని డీఎంహెచ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వారు 040- 24651119 ఫోన్ 9154170960కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విషయంలో ఆందోళన అవసరం లేదని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: రిపోర్టులు రాక.. విమానాశ్రయంలో పడిగాపులు