ఈ వీడియో కనిపిస్తున్న విద్యార్థులంతా ఏదో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు అనుకుంటే పొరపాటే. వీరంతా హైదరాబాద్ లాలాపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వీళ్లు వందశాతం కరోనా నిబంధనలను పాటిస్తున్నారు.
మాస్కులు, ఫేస్ షీల్డ్, భౌతిక దూరం పాటిస్తూ... కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. 10 నెలల తర్వాత ప్రారంభమైన పాఠశాలలో.... కరోనా నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. బడిలోకి ప్రవేశించినప్పటి నుంచి జాగ్రత్తల మధ్యే విద్యార్థులు మెలుగుతున్నారు. విరామ, భోజన సమయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులు ఇవన్నీ పాఠశాల సిబ్బంది సహకారంతోనే పాటిస్తున్నట్లు వివరించారు.
- ఇదీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ