ETV Bharat / state

'సహకార స్ఫూర్తితోనే రాష్ట్రం ముందుకు' - AGRICULTURE MINISTER NIRANJAN REDDY

భవిష్యత్ అవసరాలను తీర్చడంలో సహకార స్ఫూర్తి పై సీఎం కేసీఆర్​కు తగిన అవగాహన, ప్రణాళికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులకు విశేష సేవలందిస్తున్న సంఘాలు, సహకార స్ఫూర్తితో ఏర్పడినవేనని తెలిపారు.

శిక్షణ ఇస్తున్న యూనియన్ కార్యాలయం..విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలి : నిరంజన్ రెడ్డి
author img

By

Published : Jul 6, 2019, 10:57 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్​లోని తెలంగాణ స్టేట్ కోపరేటివ్ యూనియన్ కార్యాలయంలో 97వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మానవ సంబంధమైన వ్యవహారాలకు ప్రాతిపదికత సహకార సంఘాలేనని అన్నారు. వీటి ఆధునీకీకరణతో పాటు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకార స్ఫూర్తితోనే ముందుకెళ్తామన్నారు. సహకార స్ఫూర్తిని కలిగించేందుకు శిక్షణ ఇస్తున్న యూనియన్ కార్యాలయం.. విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న సహకార సభ్యులకు మంత్రి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకార స్పూర్తితోనే ముందుకెళ్తాం : నిరంజన్ రెడ్డి

ఇవీ చూడండి :రాజకీయ కోణాల్లోనే కేంద్ర బడ్జెట్: కర్నె ప్రభాకర్

Tg_Hyd_56_06_Agriculture Minister On Cooperative Day_Ab_TS10005 Note: Feed Etv Bharat, Ftp Contributor: Bhushanam ( ) రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలను తీర్చడంలో సహకార శాఖ పాత్ర మరియు స్ఫూర్తి పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవగాహన ప్రణాళిక ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని తెలంగాణ స్టేట్ కోపరేటివ్ యూనియన్ కార్యాలయంలో జరిగిన 97వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సంబంధమైన అనేక వ్యవహారాలకు ప్రాతిపదిక సహకార సంఘాలే అని అన్నారు . మహిళ స్వయం సహాయక సంఘాల , రైతాంగానికి విశేష సేవలందిస్తున్న సంఘాలు సహకార స్పూర్తితో ఏర్పడినవే అని అన్నారు . ఈ సంఘాలను ఆధునికీకరణతో పాటు , వర్తమాన పరిస్థితులకు తగ్గట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకార స్పూర్తితో ముందుకు తీసుకెళ్తాము అన్నారు. సహకార సభ్యులలో సహకార స్ఫూర్తిని పెందొందించడంలో సెంట్రల్ యూనియన్ కీలక పాత్ర వహించాలని ఆయన సూచించారు . ముక్యంగా సభ్యులలో సహకార స్ఫూర్తిని , కార్యాచరణను పెందొందించేందుకు శిక్షణను ఇస్తున్న యూనియన్ కార్యాలయం విశ్వద్యాలయంగా రూపాంతరం చెంది సహకార స్పూర్తితో ముందుకు సాగాలని ఆయన కోరారు . ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న సహకార సబ్యులకు ప్రశంస పత్రాలు , మూమెంటోలను మంత్రి ప్రదానం చేశారు. బైట్: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ, సహకార మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.