రాజ్యాధికారం దిశగా బీసీలు ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్.రమణ అన్నారు. రాజకీయంగా ఎదగడానికి సమాజంలో నెలకొన్న పరిస్థితులను అనుగుణంగా మలచుకుని ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణలో బీసీలు సగం బడ్జెట్‌లో బీసీలకు సగం' అనే అంశంపై బీసీ కులాల ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో రమణ పాల్గొన్నారు. రాజకీయంగా అత్యున్నత పదవులు చేపట్టడానికి సరైన నాయకత్వంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని ముందుకు సాగిన నాయకులే రాజకీయంగా నిలదొక్కుకునే అవకాశం లేకపోలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా బీసీల ఆర్థిక జీవనంలో ఎలాంటి పురోగతి లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్