ETV Bharat / state

తెలంగాణలోనూ ధోని, కపిల్​ దేవ్​ లాంటి వారున్నారు: వెంకటేశ్వర్​ రెడ్డి - రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఛైర్మన్ తాజా వార్తలు

తెలంగాణలో కూడా ధోని, కపిల్ దేవ్ లాంటి క్రీడాకారులున్నారని.. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్​ రెడ్డి.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్​కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించేలా క్రికెటర్లను తీర్చిదిద్దాలని వెంకటేశ్వర్​ రెడ్డి కోరారు.

తెలంగాణలోనూ ధోని, కపిల్​ దేవ్​ లాంటి వారున్నారు: వెంకటేశ్వర్​ రెడ్డి

author img

By

Published : Sep 9, 2020, 6:40 AM IST

తెలంగాణలోని 33 జిల్లాలలో క్రికెట్​ను అభివృద్ధి పరచాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్​ను రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​లో జరుగుతున్న గొడవలకు తక్షణమే ముగింపు పలికి ఆటను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాల్లో క్రికెట్ సంఘాలకు గుర్తిపు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించేలా తెలంగాణ జిల్లాల్లోని క్రికెటర్లను తీర్చిదిద్దాలని అజారుద్దీన్​ను అల్లీపురం వెంకటేశ్వర్​ రెడ్డి కోరారు. అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​లో జరుగుతున్న అవినీతిని పారద్రోలి, ప్రక్షాళన చేయాలని విన్నివించారు. 216 క్లబ్బులకు కూడా అఫిలియేషన్ ఇవ్వాలని.. అప్పుడే తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ జిల్లాల్లో కూడా ధోని, కపిల్ దేవ్ లాంటి క్రీడాకారులున్నారని.. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని వెంకటేశ్వర్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.