ETV Bharat / state

'పశు,పాడి,మత్స్య రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలి' - dairy sector latest News

పశు, పాడి, మత్స్య రంగాల్లో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు యంత్రాంగం ముందుకు సాగాలని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్ అరణ్య భవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తన్నీరు హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్ధక, మత్స్య రంగం, ఆర్థిక శాఖపై సంయుక్త సమావేశం నిర్వహించారు.

'పశు,పాడి,మత్స్య రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలి'

author img

By

Published : Jul 21, 2020, 8:57 PM IST

హైదరాబాద్ అరణ్య భవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తన్నీరు హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పశు సంవర్ధక, మత్స్య రంగం, ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నామని.. దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని అన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి విజయ డైయిరీ ద్వారా టెట్రా ప్యాక్ పాలు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు ఆర్థిక వనరులు సమకూర్చాలని మంత్రి హరీశ్‌రావును కోరారు.

'గోపాల మిత్ర వేతన బకాయిలు ఇప్పించండి'

4 నెలలుగా రావాల్సిన గోపాలమిత్ర వేతన బకాయిలు సహా... పాల సేకరణకు ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రోత్సాహం కూడా విడుదల చేయాలని మంత్రి తలసాని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు... ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

'పశువులకు నట్టల మందులు కావాలి'

పశువులకు నట్టల మందులు తప్పకుండా వేయాలని... ఫలితంగా మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉంటూ బరువు పెరుగుతాయన్నారు. ఇందుకు తగిన నిధులు కావాలని తలసాని కోరగా... హరీశ్‌రావు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. పశువులకు సమయానికి నట్టల మందులు వేయాలని... ఇందుకు సహకరిస్తామని మంత్రి హారీశ్ హామీ ఇచ్చారు.

చేప, గొర్రె పిల్లల పంపిణీతో...

చేప పిల్లల పంపిణీ, గొర్రెలు, మేకల పెంపకం వల్ల మత్స్య, పశు సంపద అపారంగా పెరిగిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. దేశంలో మత్స్య, పశు సంపదలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి వల్లే వ్యవసాయ అనుబంధ మత్స్య, పశు సంపదలో రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని మంత్రులు వివరించారు.

'విజయ డైరీ మరింత బలోపేతం'

ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న విజయ డైయిరీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని మంత్రులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉమ్మడి పథకాలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి హరీశ్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మా రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయ డైయిరీ ఎండీ శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

'పశు,పాడి,మత్స్య రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలి'

ఇవీ చూడండి : కొవాగ్జిన్​ తొలిదశ క్లినికల్ ట్రయల్స్​ వాలంటీర్ల డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.