రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమ్ ఆదిత్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాజాఖాన్‌తో పాటు ఉపాధ్యక్షుడు సదత్ ఖాన్, మనోజ్‌కుమార్ తదితరులు మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు, కోచ్‌లకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రంలో పెద్దపీఠ వేయబోతున్నామని స్పష్టం చేశారు.