గ్రామాల అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమానికి కృషి చేసే ఎంపీటీసీల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరించే నిర్లక్ష్య వైఖరి వీడాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం నూతన అధ్యక్షుడు కుమార్ గౌడ్ కోరారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంపీటీసీల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఎంపీటీసీగా ఎన్నికై 15 నెలలు కావస్తున్నా నిధులు, విధులు, అధికారాలు ఇవ్వకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర సంఘం మండిపడింది.
73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 243 జీ 11 షెడ్యుల్లో పేర్కొన్న విధంగా 29 అంశాలను రాజ్యాంగ, చట్ట, న్యాయబద్ధంగా నిధులు, విధులు, బాధ్యతలు, అధికారులను వెంటనే ఎంపీటీసీలకు, మండల పరిషత్‌లకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రికి కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీలకు అభివృద్ధి నిధుల కింద ప్రతి ఒక్క ఎంపీటీసీకి రూ. 20 లక్షల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సొంత నిధులతో గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చిన ఎంపీటీసీ