ETV Bharat / state

'రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం'

Mahila Congress Comments: భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి అద్దం పడుతోందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు.

mahila congress
mahila congress
author img

By

Published : Feb 6, 2022, 3:17 PM IST

Mahila Congress Comments: భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బొల్లు కిషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్‌లోని కార్ఖానా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్త అయిన అంబేడ్కర్‌ను అవమానించే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.

భారత రాజ్యాంగ వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సూచనలు చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంఛార్జి బొల్లు కిషన్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ మత్తులో ఉండి మాట్లాడడం మానుకోవాలని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: TRS and BJP Tweet War : తెరాస, భాజపా ట్విటర్​ వార్​.. ట్రెండింగ్​లో 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.