ETV Bharat / state

దేవుడు మనకు మంచి ముఖ్యమంత్రిని ఇచ్చాడు: హోంమంత్రి - రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వార్తలు

దేవుడు మనకు మంచి సీఎంను ఇచ్చాడని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్​ అలీ అన్నారు. తెరాస పాలనలోనే మైనారిటీలకు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. హైదరాబాద్​ చంపాపేట్​లోని ఓ డిగ్రీ కాలేజీ 2020 ఫెస్ట్​ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేవుడు మనకు మంచి ముఖ్యమంత్రిని ఇచ్చాడు: హోంమంత్రి

author img

By

Published : Feb 10, 2020, 4:43 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో తెరాస ప్రభుత్వ పాలనలోనే విద్య ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చంపాపేట్​లోని యాదగిరి నగర్​లో ఓ డిగ్రీ కాలేజీ 2020 ఫెస్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా శ్రద్ధతో కృషిచేయాలని హోంమంత్రి సూచించారు. మైనారిటీల విద్యకోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎంతో చేశారన్నారు. దేవుడు మనకు మంచి సీఎంను ఇచ్చాడని మహమూద్​ అలీ అభిప్రాయపడ్డారు.

కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలతో అందరిని అలరించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

దేవుడు మనకు మంచి ముఖ్యమంత్రిని ఇచ్చాడు: హోంమంత్రి

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.