పదో తరగతి పరీక్షల వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వకేట్ జనరల్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణ చర్యలు చేపడతామని ఏజీ కోర్టుకు తెలిపారు.ఈనెల 19న వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది.
ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు