ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్​​ రూ.1.70 లక్షల కోట్లని అంచనా! - సీఎం కేసీఆర్​

ప్రస్తుతం రాష్ట్ర రాబడులు తగ్గిన నేపథ్యంలో బడ్జెట్​ రూ.1.70 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ కంటే ఈసారి పద్దు 8 నుంచి 10 శాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

రాష్ట్ర బడ్జెట్​
author img

By

Published : Sep 9, 2019, 5:09 AM IST

Updated : Sep 9, 2019, 7:31 AM IST

రాష్ట్ర బడ్జెట్​​ రూ.1.70 లక్షల కోట్లని అంచనా

ఈసారి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.1.67 లక్షల కోట్ల నుంచి రూ.1.70 లక్షల కోట్ల మధ్య ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర రాబడులు అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో బడ్జెట్​ పరిమాణం ఓట్​ ఆన్​ అకౌంట్​ కంటే 8 నుంచి 10 శాతం తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఓట్​ ఆన్​ బడ్జెట్​ను రూ.1.82 లక్షల కోట్లతో ఆమోదించారు. అయితే మాంద్య పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన సీఎం కేసీఆర్​ దానికి అనుగుణంగా ప్రస్తుత పద్దుకు తుదిరూపు ఇచ్చారు.

వ్యవ'సాయ' రంగాలకు ప్రాధాన్యం

వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు ఈసారి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ వీటికి కేటాయింపులు తగ్గించకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరాస ఎన్నికల హామీలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు బడ్జెట్​లో పెద్దపీట వేయనున్నారు.

వాస్తవిక పద్దు

రాష్ట్ర బడ్జెట్​ను పూర్తి వాస్తవిక దృక్పథంతో రూపొందించామని సీఎం కేసీఆర్​ అన్నారు. ఇప్పటిదాకా బడ్జెట్​ అంటే అంకెల గారడీ అన్న భావనను మార్చబోతున్నామని పేర్కొన్నారు. పూర్తి స్థాయి పద్దు నూతన ఒరవడి సృష్టిస్తుందని తెలిపారు. తాత్కాలిక బడ్జెట్​ కంటే ఈసారి కేటాయింపులు తక్కువగా ఉంటాయని వివరించారు.

ఇదీ చూడండి : కేసీఆర్​ కేబినెట్​లో 18కి చేరిన మంత్రుల సంఖ్య

Intro:గోదావరి నది వరద ఉధృతిBody:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అశ్వాపురం మండలం లోని అమెర్ధ, చింతిర్యాల, ఆనందాపురం, నెల్లిపాక
గ్రామాల రహదారిపై కి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. మనుగూరులోని అన్నారం, పినపాక మండలంలోని చింతల బయ్యారం గ్రామం లో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి . నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు.Conclusion:మనుగూరు ఉపరితల గనిలో గోదావరి వరద వల్ల మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నది సమీపంలో ఉన్న మణుగూరు ఉపరితల గని లో ఆదివారం పూర్తిగా
పనులు నిలిచాయి. గని సమీపంలో ఉన్న ఇన్ టెక్ వెల్ వద్ద వరద ప్రవాహం 761 ఆర్ ఎల్ గా చూపిస్తుంది. దీంతో సింగరేణి అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేసి యంత్రాలను , కార్మికులను గని వెలుపలకు తరలించారు.
Last Updated : Sep 9, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.