ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ పరిధిలో శానిటైజేషన్ మొదలు

రాష్ట్రంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న సందర్భంగా హైదరాబాద్​లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ కొవిడ్​ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్​ చేస్తున్నాయి. ఈరోజు పలు ప్రాంతాల్లోని కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణంతో పిచికారీ చేశారు.

sanitization within the GHMC area, ghmc corona news updates
జీహెచ్‌ఎంసీ పరిధిలో శానిటైజేషన్ మొదలు
author img

By

Published : Apr 22, 2021, 4:41 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్​పై ప్రత్యేక దృష్టి సారించాయి. జంట నగరాల్లోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో... జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు సోడియం హైపోక్లోరైడ్​ స్ప్రే చేస్తున్నారు.

హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేష‌న్‌, యాంటి లార్వా స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. 19 డిజాస్టర్ డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో ఇవాళ కూకట్ పల్లి, నిజాంపేట్, కేపీహెచ్​బీ, మియాపూర్​లో రోడ్లు, ఇతర కాలనీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్​తో శానిటైజ్ చేశారు.

ఇదీ చూడండి : 'లంగ్స్​పై భారీ స్థాయిలో కరోనా 2.0 దెబ్బ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.