ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దాదాపు 2 నెలల అనంతరం ఏపీ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తొలిరోజు 1,683 బస్సులు తిరిగేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీ ఆర్టీసీకి ఉన్న 12 వేల బస్సుల్లో 17శాతం బస్సులనే నడుపుతున్నారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా అధికారులు తగిన చర్యలు చేపట్టింది. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి సిబ్బంది అనుమతిస్తోంది. ప్రయాణికుల కోసం శానిటైజర్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: కొత్త మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు