ETV Bharat / state

GEETHAREDDY: 'వైద్యులు దేవుళ్లతో సమానమైనప్పుడు.. నర్సులు దేవతలు కారా?' - staff nurses strike at gandhi bhavan

విధుల నుంచి తొలగించిన తమను తిరిగి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ఒప్పంద స్టాఫ్​ నర్సులు గాంధీభవన్​లో చేపట్టిన దీక్షను విరమించారు. నర్సుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతిస్తుందని వారికి భరోసానిచ్చిన టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి... దీక్షను విరమింపజేశారు.

'వైద్యులు దేవుళ్లతో సమానమైనప్పుడు.. నర్సులు దేవతలు కారా?'

author img

By

Published : Jul 30, 2021, 10:04 PM IST

'వైద్యులు దేవుళ్లతో సమానమైనప్పుడు.. నర్సులు దేవతలు కారా?'

కొవిడ్‌ సమయంలో తమ సేవలు ఉపయోగించుకుని.. వైరస్​ తీవ్రత తగ్గగానే ఒప్పంద స్టాఫ్‌ నర్సులను ప్రభుత్వం తొలిగించటంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీభవన్‌లో స్టాఫ్‌ నర్సులు చేస్తున్న 48 గంటల దీక్షను టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి విరమింపజేశారు. స్టాఫ్‌ నర్సుల పోరాటానికి కాంగ్రెస్ మద్దుతిస్తుందని...​వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా తమ పార్టీని నమ్మి గాంధీభవన్ మెట్లెక్కిన స్టాఫ్‌ నర్సులకు తమవైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని గీతారెడ్డి పేర్కొన్నారు. నర్సులతో ఒక కోర్ కమిటీ వేసుకొని.. పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ తన బిడ్డ కవిత ఎన్నికల్లో ఓడిపోతే భరించలేక వెంటనే ఎమ్మెల్సీని చేశారని.. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడైన ముఖ్యమంత్రి ఈ బిడ్డలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో కొవిడ్ రోగులకు నర్సులు సేవలు అందించారని గీతారెడ్డి గుర్తు చేశారు. అలాంటి వాళ్లను తొలగించడం ఏంటని ఆమె నిలదీశారు. వైద్యులు దేవుళ్లతో సమానమైనప్పుడు.. నర్సులు దేవతలు కారా అని ప్రశ్నించారు. వీరి విషయమై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ప్రభుత్వంతో కొట్లాడతారని గీతారెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ పార్టీని నమ్మి గాంధీభవన్​ మెట్లెక్కిన పిల్లలందరికీ నేను విశ్వాసం ఇస్తున్నా.. మీ సమస్యకు పరిష్కారం లభించే వరకు మీ వెంట మేముంటాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో స్టాఫ్​ నర్సులను విధుల్లోకి తీసుకుని.. రెగ్యులర్ చేస్తామని మాటిచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు వారిని విధుల్లోంచి తొలగించడం ఏంటి? మీ అందరికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్​ పార్టీ మీకు అండగా ఉంటుంది.

-గీతారెడ్డి, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు​

ఇదీ చూడండి: Nurses Protest: గాంధీభవన్​ వద్ద ఉద్రిక్తత.. పలువురు నర్సులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.