ETV Bharat / state

స్టాఫ్​ నర్సుల నియామక పరీక్ష మెరిట్​ జాబితా విడుదల - హైదరాబాద్​ తాజా వార్తలు

ప్రజారోగ్య శాఖ, వైద్య విదాన పరిషత్​లో స్టాఫ్​ నర్సుల ఉద్యోగ నియామక పరీక్ష మెరిట్​ జాబితాను టీఎస్​పీఎస్​సీ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 19 వరకు ఆన్​లైన్​లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Staff Nurses Recruitment Examination Merit List Released by tspsc commission
స్టాఫ్​ నర్సుల నియామక పరీక్ష మెరిట్​ జాబితా విడుదల
author img

By

Published : Nov 7, 2020, 10:16 PM IST

వైద్యారోగ్య శాఖలో స్టాఫ్​ నర్సుల ఉద్యోగ నియామక పరీక్ష మెరిట్​ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వెల్లడించింది. ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్​లో 3, 311 స్టాఫ్​ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం 2018 మార్చి 11న టీఎస్​పీఎస్​సీ నోటిఫికేషన్​ జారీ చేసింది. పరీక్ష రాసిన 21,391 మంది మెరిట్​ వివరాలను వెబ్​సైట్​లో పొందుపరచింది.

రాత పరీక్ష ఫలితాలను ప్రకటించిన టీఎస్​పీఎస్​సీ.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు టీఎస్​పీఎస్​సీ ఎంపిక చేసింది. ఈ నెల 13 నుంచి 19 వరకు ఆన్​లైన్​లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు టీఎస్​పీఎస్​సీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిః సీటెట్ పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.