కొవిడ్ చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఇటీవల చేపట్టిన స్టాఫ్ నర్సుల నియమకాలు కాంట్రాక్టా... ఔట్ సోర్సింగా అనే అంశంపై తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చింది. ఎంపికైన నర్సు అభ్యర్థులు హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. స్టాఫ్ నర్సులు... డీఎంఈ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ను కలిశారు. కాంట్రాక్టు... ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య తేడా ఉండదని... వేతనాలు, సౌకర్యాలన్నీ అందరికీ వర్తిస్తాయని డీడీ చెప్పడం వల్ల అభ్యర్థులు విధుల్లో చేరారు.
కొలిక్కివచ్చిన స్టాఫ్ నర్సుల నియామక వివాదం - hyderabad news
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన స్టాఫ్ నర్సుల నియామక వివాదం కొలిక్కివచ్చింది. స్టాఫ్ నర్సుల నియామకాలు కాంట్రాక్టా... ఔట్సోర్సింగా అన్న అంశంపై అభ్యర్థులు డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ను కలిశారు. దీనిపై డీడీ ఇచ్చిన స్పష్టతతో... అభ్యర్థులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు.