ETV Bharat / state

శ్రీశైలానికి వరద ప్రవాహం.. పది గేట్లు ఎత్తివేత..

కృష్ణమ్మ మళ్లీ ఉరకలెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగడంతో... పది గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

పది గేట్లు ఎత్తివేత
author img

By

Published : Oct 23, 2019, 10:18 PM IST

కృష్ణానదిలో వరదప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున వరద వస్తుండటంతో... పది గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4 లక్షల 60 వేల క్యూసెక్కులు కాగా... స్పిల్‌వే ద్వారా 2 లక్షల 79 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. ప్రవాహం స్థిరంగా ఉండటం వల్ల.. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 78 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదలవుతోంది. శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం దాదాపు 885 అడుగులు, నీటి నిల్వ 215 టీఎంసీలుగా ఉంది.

ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన

Intro:42

Body:42

Conclusion:శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 5,09,868 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. ఆనకట్ట 10 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే నుంచి 3.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలవుతోంది. మరో వైపు ఆనకట్ట నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 68 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు వదులుతున్నారు. ఈ సీజన్లో ఏడో సారి గేట్లను ఎత్తి దిగువ కు నీటిని విడుదల చేయడం విశేషం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.