రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ను అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడిన హోంగార్డుతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్లోని ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు లాక్‌డౌన్ నేపథ్యంలో వసతి గృహాలు మూసివేయడం వల్ల తమతమ సొంతూళ్లకు వెళ్లడానికి ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.
కాగా వారికి ఎన్‌ఓసీ ధ్రువపత్రాలు ఇప్పిస్తామని చెప్పి అదే ఠాణాలో పనిచేసే హోంగార్డు, ఓ హాస్టల్ నిర్వాహకుడు, స్థానిక బాపూనగర్ బస్తీ అధ్యక్షుడు కలిసి విద్యార్థులు, ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ మురళీకృష్ణ దీనిపై దర్యాప్తు చేసి వారి ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల