ETV Bharat / state

పీర్జాదిగూడలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​-2019 క్రికెట్ పోటీలు​ - క్రీడలు తాజా వార్త

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడతాయని ఈనాడు హైదరాబాద్​ యూనిట్​ మేనేజర్​ రమేశ్​బాబు తెలిపారు. ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​-2019 క్రీడలలో  క్రికెట్​ పోటీలను హైదరాబాద్​ పీర్జాదిగూడలో ఈనాడు చీఫ్​ మేనేజర్​ రమ టాస్​వేసి ప్రారంభించారు.

sports in Hyderabad
పీర్జాదిగూడలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​-2019 క్రికెట్ పోటీలు​
author img

By

Published : Dec 17, 2019, 5:53 PM IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు.. శారీరక దారుఢ్యాన్ని బలిష్ఠం చేస్తాయని ఈనాడు హైదరాబాద్‌ యూనిట్‌ మేనేజర్‌ రమేశ్‌బాబు అన్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో ఈనాడు యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గడచిన 13 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 క్రీడలు పీర్జాదిగూడలో ఇవాళ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఈ క్రీడలను ఈనాడు చీఫ్‌ మేనేజర్‌ రమ, హైదరాబాద్‌ యూనిట్‌ మేనేజర్‌ రమేశ్‌ బాబు, ఈవెంట్ మేనేజర్‌ సత్యబాబులు ప్రారంభించారు.
2006లో ఈనాడు కప్‌ పేరుతో ఏర్పాటైన క్రికెట్‌ పోటీలు... ఆ తరువాత ఈనాడు చాంఫియన్‌గా, తాజాగా ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ పేరుతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. క్రికెట్‌ ఆటతో మొదలైన ఈనాడు క్రీడలు నేడు కబడ్డీ, వాలీబాల్‌, టెన్నీస్‌ తదితర ఏడు రకాల క్రీడలను ప్రోత్సహించే విధంగా జరుపుతున్నట్టు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు లీగ్‌-2019లో 1,700 కళాశాలలకు చెంది 40 వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని రమేశ్‌బాబు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీల్లో 1500 బృందాలు పాల్గొంటున్నాయని తెలిపారు. అనంతరం ఈనాడు చీఫ్‌ మేనేజర్‌ రమ టాస్‌ ద్వారా ఇవాళ పోటీ పడనున్న క్రికెట్‌ బృందాల్లో...బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లను ఎంపిక చేశారు.

పీర్జాదిగూడలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​-2019 క్రికెట్ పోటీలు​

ఇదీ చూడండి: విశాఖ వేదికగా రేపే భారత్​-వన్డే మ్యాచ్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.