ETV Bharat / state

తీరొక్క పూల పండగ బతుకమ్మ ఈసారి ఎప్పుడు? - తెలంగాణ బతుకమ్మ 2020

ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ' బతుకమ్మ' వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఈ పూల పండక్కి ఆటంకాలొచ్చాయి. చల్లగాలి మొదలవుతున్నా... తెలంగాణలో పూలసందడికి ఇంకా వేళ కాలేదంటున్నది. ఈ సారి బతుకమ్మ పండగను ఎప్పుడు మొదలుపెట్టి.. ఎలా కొనసాగించాలి అనే దానిపై పండితులు స్పష్టం చేశారు.

bathukamma festival
bathukamma festival
author img

By

Published : Sep 7, 2020, 9:20 AM IST

బతుకమ్మ పండుగ... మన సంస్కృతి. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. నెలకొంటుంది. భాద్రపద మాసం బహుళ అమావాస్య (మహాలయ అమావాస్య) నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) వరకు రోజుకొక్క రూపు కట్టి, వినసొంపైన ఆటపాటలతో బతుకమ్మను కొలువడం ఆనవాయితీ. అయితే, ఈసారి ఆశ్వీయుజ మాసం అధికంగా రావడంతో బతుకమ్మ ఉత్సవాలు ఎప్పుడు, ఎలా జరపాలన్న దానిపై చాలామందిలో సందిగ్ధత నెలకొన్నది.

ఈ ఏడాది ఆశ్వీయుజం అధికంగా వచ్చింది. అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదని సనాతన శాస్ర్తాలు ఘోషిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మిక సాధనలకు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. ‘అధికస్య అధికం ఫలం’ అన్నారు పెద్దలు. ఈ నెలలో జపాలు, పూజలు, దానాలు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుందనీ చెప్తారు. కానీ పండుగలు, శుభకార్యాలు చేయడంపై మాత్రం నిషేధం విధించారు. ఈ కారణంగానే అధికమాసంలో పెళ్లిలు, గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు జరగవు. అంతేకాదు, అధికమాసంలో వచ్చే పండుగలను కూడా ఆ తర్వాత వచ్చే నిజ మాసంలోనే చేసుకోవాలన్నది పెద్దల నిర్ణయం. శ్రాద్ధాది విధులను సైతం నిజ మాసంలోనే ఆచరించాలి. ఒక్కరోజు పండుగైతే నిజమాసంలో చేసుకునే వీలుంది. బతుకమ్మ పండుగ రెండు నెలలతో ముడిపడి ఉంది. అందుకే, పంచాంగ కర్తలు, వేద పండితులు దీనిపై ఇటీవల ఒక స్పష్టత నిచ్చారు. ‘బాధ్రపద బహుళ అమావాస్య సెప్టెంబర్‌ 17 నుంచి కాకుండా అధిక ఆశ్వీయుజ బహుళ అమావాస్య అక్టోబర్‌ 16 నుంచి నిజ మాసంలోనే బతుకమ్మ ఉత్సవాలు చేసుకోవాలని’ వారు సూచించారు. అయితే, కొన్ని ప్రాంతాలలో పెద్దల అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి, నెల తర్వాత నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అక్టోబర్‌ 17 నుంచి పండుగ కొనసాగించనున్నారు.

ఈ బతుకమ్మకు ముందు వచ్చే మరో ముఖ్యమైన పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ పెద్దల పండుగ అయితే, బొడ్డెమ్మ చిన్నపిల్లలు, కన్నె పిల్లల వేడుక. అయితే, ఒక్కోచోట ఒక్కోలా ఈ పండుగను జరుపుకొంటారు. కొన్నిచోట్ల పది రోజుల పాటు బొడ్డెమ్మ ఆడుతుంటే, మరికొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఆడతారు. ఈ వేడుక మాత్రం యథావిథిగా భాద్రపదంలోనే జరుపుకోవచ్చునని వేద పండితులు తేల్చారు.

ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.