ETV Bharat / state

మకర సంక్రమణ శోభ.. ఉత్తరాయణం ఆగమనం

కాలం సంక్రమణశీలం. సంక్రమణం అంటే చక్కగా ముందుకు సాగడం. సంక్రమణమే సంక్రాంతి. సౌరమండలంలో ఉన్న భూమికి సూర్యుడే పెద్ద దిక్కు. అతడే భూమికి దారి చూపుతాడు. అయనం అంటే దారి. సూర్యుడు ఉత్తరం వైపు ఆరునెలలు, దక్షిణం వైపు ఆరు నెలలు ప్రయాణిస్తాడు. అందుకే ఉత్తరాయణం, దక్షిణాయనం అనే కాలభేదాలు ఏర్పడ్డాయి.

మకర సంక్రమణ శోభ
మకర సంక్రమణ శోభ
author img

By

Published : Jan 14, 2021, 9:15 AM IST

సూర్యుడు ఒక ఏడాదిలో జ్యోతిర్మండలంలోని పన్నెండు రాసులలోకి ప్రవేశిస్తాడు. ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుంది. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని శుభప్రదంగా, అభ్యుదయ కారకంగా భావించడమే పండుగ.

మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం అనే ఆరు రాసులలో సూర్య సంచారం ఉండే కాలం ఉత్తరాయణం. ఇది దేవతలకు పగలు. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు... ఈ ఆరు రాసులలో సూర్యుడు సంచరించే కాలం దక్షిణాయనం. ఇది దేవతలకు రాత్రి. ఇలా రెండుగా జరిగే కాలవిభజనలో దేవతలు మేల్కొని ఉండే ఉత్తరాయణ కాలాన్ని పుణ్యప్రదంగా, శుభదాయకంగా మానవాళి నమ్మిన కారణంగా - సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పవిత్ర దినమైన ‘మకర సంక్రాంతి’ పెద్ద పండుగగా అవతరించింది.

లోకంలో జీవించి ఉన్నవారికే కాకుండా, మరణించిన వారికి కూడా ఈ పుణ్యదినం ఉత్తమ లోకాలను ప్రసాదిస్తుందని ధర్మ శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ పండుగ నాడు పితృదేవతల ప్రీతికోసం నువ్వులు దానం చేయడం సంప్రదాయం. నువ్వుల్లో ఉండే ఉష్ణకారక గుణం చలికాలంలో దేహరక్షణకు తోడ్పడుతుందని అందరి నమ్మకం. నువ్వులతోపాటు, వేడిని పుట్టించే నెయ్యిని, కంబళ్లను (గొంగళ్లను) దానం చేయడం ఈ పండుగలోని ప్రత్యేకత. ఈ రోజు చక్కెరతో కలిపిన నువ్వులను తింటే ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని విశ్వాసం.

ముచ్చటగా మూడుదినాల పండుగ ఇది. భోగి అంటే భోగాలకు నిలయం. ఇష్టదేవతలను పూజించి, అనుగ్రహాన్ని పొందడం భోగం. భోగం అంటే ఉత్తమయోగం. భోగిమంటలు వేయడంలోని ఆంతర్యం జీవితం వెలుగుతూ ఉండాలని ఆశించడమే. చెడును కాల్చివేసి, మంచిని వెలిగించడమే భోగి. పాడిపంటల సమృద్ధికి మూలమైన గో, పశుసంపదను, వ్యవసాయాధార సామగ్రిని, ధాన్యాన్ని పూజించి, వైభవాన్ని ప్రదర్శించే పండుగ ‘కనుమ’.

గోమయంతో చేసిన గొబ్బెమ్మలు, చుక్కలతో తీర్చిదిద్దిన ముగ్గులు- సంక్రాంతి ప్రత్యేకతలు. గోమయం క్రిమిసంహారకం కనుక వాకిళ్లలో గొబ్బెమ్మలను తీర్చిదిద్దడం సంప్రదాయం. ఈ పండుగ వేళ ఆకాశంలోకి పతంగులు (గాలిపటాలు) ఎగరేస్తారు.

మనిషి తాను నూరేళ్లూ ఆరోగ్యంతో బతకాలని కోరుకుంటాడు. ఆ కోరిక ప్రతిరూపమే సంక్రాంతి పండుగ. ధాన్య, లవణ, భోగ, రూప, తేజో, సౌభాగ్య, తాంబూల, మనోరథ, అశోక, ఆయుః, ధన, మకర అనే పన్నెండు సంక్రాంతులు పన్నెండు నెలల్లో వరసగా సంభవిస్తాయని శాస్త్రవాక్యం. ఒక్కొక్క సంక్రాంతినాడు ఒక్కొక్క విశేషంతో దానాలు చేయాలని, అలా చేయడం వల్ల సకల శుభాలూ కలుగుతాయని మహర్షుల ఉపదేశం.

దానాలకు ప్రత్యేకమైన మకరసంక్రాంతిని పరిశీలించినప్పుడు మనిషి జీవితం భోగమయమే కాక, త్యాగమయం కూడా అనే సత్యం అవగతమవుతుంది.
మకరసంక్రాంతి నాడు సూర్యుడు ఎలా ఉజ్జ్వలిస్తూ ముందుకు సాగుతాడో, అలాగే ప్రతి మనిషీ ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు సాగాలని అందరమూ కోరుకుందాం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.