ETV Bharat / state

Inspiration Story: ఆమె వేసిన ముందడుగుతో.. వేల జీవితాల్లో అక్షర వెలుగులు!!

సాయమడగటానికంటే ముందు సాయం చేయాలన్నది నిషిత నమ్మిన సిద్ధాంతం... అందుకే ముందడుగు వేసి చిన్నవయసులోనే 300 మంది ఆడపిల్లల్ని సొంతంగా చదివించింది. ఆమె వేసిన ఆ ముందడుగు వేలమంది బాలికల జీవితాల్లో అక్షర వెలుగులు నింపింది.. మరెన్నో వేలమందికి చదువుని అందించాలను కుంటున్న నిషిత తన ఆలోచనలను వసుంధరతో పంచుకుంది...

nishitha
ముప్ఫైనాలుగు వేలమందిని చదివిస్తోంది
author img

By

Published : Nov 9, 2021, 9:03 AM IST

Updated : Nov 9, 2021, 10:24 AM IST

విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. కానీ చాలా మందికి, ముఖ్యంగా అమ్మాయిలకు అందని ద్రాక్షే అవుతోందంటుంది నిషిత. కొందరికి పాఠశాలకు వెళ్లే వీలే లేకపోతుంటే మరికొందరు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. ఆడపిల్లలకు చదువు అనవసరమని భావించడం ఒక కారణమైతే స్థోమత లేకపోవడం మరో కారణం. అందుకే వాళ్లకి సాయమందించాలనుకుంది. నిషితది గుజరాత్‌లోని వడోదర. సోషల్‌వర్క్‌లో డిగ్రీ, హ్యూమన్‌ రిసోర్సెస్‌లో మాస్టర్స్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో డిప్లొమా చేసింది. చిన్నతనం నుంచే ఆమె ప్రతి పుట్టినరోజును అమ్మానాన్న అనాథ, వృద్ధాశ్రమాల్లో నిర్వహించేవారు. వ్యాపారి అయిన నాన్న గులాబ్‌ రాజ్‌పుత్‌ కొంతమంది ఆడపిల్లల్నీ చదివించే వాడు. సెలవుల్లో వారిని ఇంటికి ఆహ్వానించే వారు కూడా. ఇవన్నీ ఆమెలో స్ఫూర్తిని కలిగించాయి. తన ఖర్చులకూ, విహార యాత్రలకు ఇచ్చిన మొత్తాన్ని అనాథాశ్రమాలకే ఇచ్చేసేది. ఓసారి వాళ్ల పనిమనిషి 14 ఏళ్ల తన కూతుర్ని తీసుకొచ్చింది. నిషిత ఆ అమ్మాయితో మాట్లాడింది. కనీసం టైమ్‌ చెప్పడం కూడా రాకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకపోతే ఎలా బతుకుతుంది అనుకుంది. అప్పుడే అమ్మాయిలకి చదువు ఎంత ముఖ్యమో తనకు అర్థమైంది.

అమ్మానాన్నల్ని సాయమడిగి, ఆ అమ్మాయిని స్కూల్లో చేర్పించింది. అలాంటి వారే మరో 151 మందిని గుర్తించింది. కొన్ని స్థానిక స్కూళ్ల సాయమడిగింది. మిగతావారి కోసం ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. కానీ అది అంత సులువు కాదని అర్థమైంది. చాలా మంది.. ముక్కూమొహం తెలియని అమ్మాయికి ఎందుకు సాయం చేయాలని అడిగేవారు. వాళ్లకు నమ్మకం కలిగించడానికి పారదర్శకంగా వ్యవహరించాలనుకుంది. దాతల నుంచి డబ్బు నేరుగా స్కూలుకే చేరేలా చెక్‌లు తీసుకునేది. ఆ పిల్లల పురోగతిని తెలియజేసేలా వాళ్ల మార్క్‌ షీట్లను దాతలకు పంపేది. దీని వల్ల తాము ఇచ్చిన డబ్బు ఎవరికి చేరుతోందనేదే కాకుండా వాళ్ల జీవితం ఎలా సాగుతోందో కూడా దాతకు తెలుస్తుందంటుంది నిషిత. దీంతో చాలా మందికి నమ్మకం కలిగి సాయం చేయడం ప్రారంభించారు. విదేశాల నుంచీ సాయమందుతోంది. 2011లో ప్రారంభమైన ఈ సేవ ఇంతలింతలుగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ మూడున్నర కోట్లకుపైగా సేకరించి, 34,000 మంది పైగా అమ్మాయిలకు చదువుకునే అవకాశమిచ్చింది. తన తపన చూసి ఉచితంగా కొన్ని, రాయితీతో కొన్ని స్కూళ్లు అమ్మాయిలను చేర్చుకుంటాయి. కొంత మందికి ఫీజులు తను చెల్లిస్తుంది. ఈ పనుల్లో కొందరు వయోధికులు తనకు సాయం చేస్తుంటారు. స్థానిక ఎన్‌జీఓలు కొన్ని నిధుల సేకరణలో తోడ్పడుతున్నాయి. కొవిడ్‌లోనూ నిషిత సేవలను ఆపలేదు. ఆన్‌లైన్‌ అవకాశం లేని వారికి స్కూలు ఫీజులతోపాటు మొబైళ్లనూ అందించింది. నిషితకు ఇటీవలే పెళ్లి అయ్యింది. ఆర్భాటాలేమీ లేకుండా తక్కువ మంది సమక్షంలో చేసుకుంది. అలా మిగిల్చిన సొమ్మునూ అమ్మాయిల చదువుకే కేటాయించింది. 21 మంది పేర రూ.5000 చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించడమే కాకుండా సుమారు 300 మందికి స్కూలు ఫీజులనూ డిపాజిట్‌ చేసింది.

ఇవేకాదు..

ఏ ఆధారమూ లేని రెండు వందల మంది వృద్ధులను చేరదీసి, వారి బాగోగులనూ చూసుకుంటోంది. ఆడవాళ్లకి కుట్టు మిషన్లు అందించడం, డబ్బా సర్వీస్‌ అవకాశాలను కల్పించడం ద్వారా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహి స్తోంది. ఓ స్కూలును ప్రారంభించి పేద బాలికలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం తన కల. ఇప్పుడా ప్రయత్నాల్లోనే ఉంది. తన కల నెరవేరాలని మనమూ కోరుకుందాం.

‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. అలాంటిది కొందరికి పేదరికం అడ్డు కాకూడదనుకున్నా. సాయమనేది ముందు మనం చేసి, తర్వాత ఇతరులను అడగాలన్న ఉద్దేశంతో 300 మందిని స్వయంగా చదివిస్తున్నా. కొందరికైనా సాయం అందించగలిగితే చాలనుకున్నా. ముప్ఫై నాలుగు వేల మందికిపైగా అమ్మాయిలకు చదువును అందించగలిగినందుకు ఆనందంగా ఉంది’

- నిషిత

Last Updated : Nov 9, 2021, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.