ETV Bharat / state

వైరస్​లు ఆశ్రయంగా చేసుకునే కొత్త అతిథులు మానవుడే..!

author img

By

Published : Sep 13, 2020, 5:14 AM IST

మానవుడి అత్యాశకు.. విపరీత పోకడలకు.. ఆక్రమణలకు.. జీవవైవిధ్యం, ప్రకృతి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. మానవ తప్పిదాలకు... ఎప్పుడూ ప్రకృతే మూల్యం చెల్లించుకుంటుంది. మానవాళి ముందు నుంచే భూమిపై ఉంటోన్న వణ్యప్రాణులు, పక్షులు, జలచరాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు మనషి. అభివృద్ధి పేరుతో అటవులు అక్రమించేస్తున్నాడు.. జలాలను కలుషితం చేసేస్తున్నాడు. ఫలితంగా.. జంతుజాలం ప్రమాదకర స్థాయిలో అంతమవుతోంది. కానీ అంతరించిపోతున్న జీవరాశి.. తగ్గిపోతున్న పశు-పక్ష్యాదులు తిరిగి మానవాళికే పెను ముప్పు మోసుకొస్తున్నాయి. తెరుకుని... ప్రకృతిని అందులో కీలకమైన జీవజాలాన్ని పరిరక్షించుకోకపోతే.. ఇబ్బందులు తప్పవంటున్నారు పరిశోధకులు.

వైరస్​లు ఆశ్రయంగా చేసుకునే కొత్త అతిథులు మానవుడే..!
వైరస్​లు ఆశ్రయంగా చేసుకునే కొత్త అతిథులు మానవుడే..!
వైరస్​లు ఆశ్రయంగా చేసుకునే కొత్త అతిథులు మానవుడే..!

జంతువులు, పక్షులు, జలచారాలు.. ఇలా భూగోళంపై ఉన్న మూడింట రెండొంతుల జంతుజాలం గడిచిన 50 ఏళ్లలోనే.. అంతరించిపోయింది. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం ద్వారా... భూమికి చాలా నష్టం జరుగుతోందని ఏళ్లుగా నివేదికలు ఘోషిస్తున్నాయి. అయినా.. అవేమి పట్టించుకోని మనిషి .. చెట్లను నరుక్కుంటూ పోతున్నాడు. అడవులను దోచుకుంటున్నాడు. జంతువులను విపరీతంగా వేటాడుతున్నాడు. పక్షుల జీవితాలను దుర్భరం చేసి.. వాటికి దినదినగండంగా పరిణమించాడు. ఇక జలాలపై పట్టుకోసం.. తన అవసరాలు, సరదాల కోసం.. నీటిలో దాక్కున్న జీవాలను వెతికివెతికి చంపితింటున్నాడు. ఫలితంగా... రానున్న శతాబ్దాల్లో భూమిపై మానవుడు తప్ప మరెవరూ మిగలని పరిస్థితులు తలెత్తనున్నాయి.

సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటారు. తొలుత వృక్షాలు, జంతుజాలం అవతరించాయి. క్రమక్రమంగా ఉభయ చరాలు, పక్షులు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. కుందేళ్లు, గేదేలు, జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తుంది. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. ఆహారం, గాలి, నీరు రక్షణ, ఆశ్రయం నిత్యావసర వస్తువులు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి.

మనిషి విచక్షణారాహిత్యం వల్లే జీవవైవిధ్యం దెబ్బ తింటోంది. ప్రకృతి విధ్వంసకర పనుల వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. నానాటికి కాలుష్యం పెరిగిపోవడం, విస్తరించాల్సిన జీవజాతుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే మనుషుల చర్యల వల్ల.. మూడొంతుల భూమి, 40% నీరు ప్రభావితం అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. దశాబ్దాలు మారుతున్న కొద్దీ... విధ్వంసం మరింత వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా... అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చివేయటం తీవ్రంగా ప్రభావం చూపుతోంది. 1970 నుంచి 2016ల మధ్య దాదాపు 68శాతం జంతుజాలం తగ్గిపోయిందని తేల్చిన నివేదిక ప్రమాద తీవ్రతను ప్రతిబింబిస్తోంది.

ముఖ్యంగా గ్లోబలైజేషన్‌ ఆరంభం అయినప్పటి నుంచి మానవుడు మరింత విజృంభించినట్లు చెబుతున్నారు పరిశీలకులు. గాలి, నీరు, భూమి ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. ఆధునికీకరణ మోజులో మనం వాటిని మరిచిపోయాం. చెట్లను ఇష్టమెచ్చినట్లుగా కొట్టేయడం, గాలి, ధ్వని, జల కాలుష్యాల కారణంగా భూతాపం పెరిగిపోయింది. సమతుల్యత దెబ్బతినడంతో జీవవైవిధ్యం వినాశనం జరిగి జీవజాతులు అంతరించే పోయే ప్రమాదస్థాయికి చేరుకుంది. ఇంతటి ఆవశ్యకత కల్గిన జీవ వైవిధ్యాన్ని సరైన మార్గంలో వాడుకొని భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మేల్కొని కఠిన చర్యలు తీసుకోకపోతే సమీప భవిష్యత్‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రకృతే ఉమ్మడి ఆస్తి. కానీ... నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజాతులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటి మీద ఆధారపడే జీవులూ నశిస్తున్నాయి. భూమి మీద 10-14 మిలియన్ల జాతుల జీవులు నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. ఇందులో లక్షలకు పైగా వృక్షజాతులు, జంతుజాతులు, కీటకాలు ఉన్నాయి. 10వేల రకాల జాతులు కొత్తగా గుర్తింపులోకి వస్తున్నాయి. అంతే సంఖ్యలో అంతరించి పోతున్నాయి. మానవ తప్పిదాలతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ జీవవైవిధ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

మరోవైపు డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ నివేదిక ప్రకార సాంక్రమిక వ్యాధులు విజృంభిస్తూ సంవత్సరాలుగా మానవాళిని హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఈ వ్యాధులు మళ్లీ మళ్లీ మానవులను పలకరిస్తూనే ఉన్నాయి. ఇది వాతావరణ సమస్య కాకపోవచ్చు. కానీ, అడవుల నిర్మూలన అనేది జంతువుల నుంచి మానవుల వరకు మలేరియా, డెంగ్యూ, ఇతర ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టించిందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి జంతువులకు, మానవులకు వ్యాపించిందని నమ్ముతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టానుసారం ధ్వంసం చేసుకుంటూ పోతే కలిగే పర్యవసానాల గురించి పరోశోధకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

మనిషి ఉష్ణమండల అరణ్యాలను, ఇతర వణ్యప్రాణులు నివసించే అటవీ ప్రాంతాలను మనం ఆక్రమించేశాడు. ఇవి అనేక జంతువులు, వృక్షాలకు నెలవుగా ఉంటున్నాయి. ఈ జీవుల్లోనే అనేక తెలియని వైరస్‌లు ఉంటున్నాయి. మనం చెట్లను నరికేస్తాం, జంతువులను వధిస్తాం లేదంటే వాటిని పట్టి మార్కెట్లకు పంపుతాం. అంటే పర్యావరణవ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నట్లే లెక్క. అంతకుమించి వైరస్‌లు తాము సహజంగా ఉండే ప్రకృతి నెలవుల నుంచి వెలుపలికి వచ్చేలా మనం ప్రకృతిని కుళ్లబొడిచేస్తున్నాం. వైరస్‌ల నెలవులు కదిలిపోయినప్పుడు, హరించుకుపోయినప్పుడు ఆ వైరస్‌లు తమకు ఆశ్రయమిచ్చే కొత్త అతిథులను ఎంచుకుంటాయి. చివరకు అది మానవుడే అవుతున్నాడు.

ఇదీ చదవండి: భారత జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాలి: ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.