ETV Bharat / state

ఆషాఢం.. శూన్యమాసమే కాదు అమ్మవారి మాసం!

author img

By

Published : Jun 22, 2020, 1:49 PM IST

ఆషాఢమాసం రాగానే ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం తెలుగునాట ఓ సంప్రదాయంగా పాటిస్తారు. అయితే ఈ నెల ప్రత్యేకత అదొక్కటే అనుకుంటే పొరపాటు. ఆషాఢాన్ని పర్వదినాల మాసమనీ అంటారు. అంతటి విశిష్టత కలిగిన ఈ నెలలో అసలు ఎలాంటి పర్వదినాలు ఉన్నాయంటే...

special festivals in aashadam month
అమ్మవారి మాసం... ఆషాఢం!

చంద్రుడి ప్రయాణాన్ని బట్టి నెలల పేర్లు నిర్ణయించారని అంటారు. ప్రతి నెలకూ ఓ ప్రాముఖ్యత ఉన్నట్లే... ఆషాఢ మాసానికీ ఉంది. తెలుగు సంవత్సరాదిలో ఇది నాలుగో నెల. చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గరకు ప్రవేశించినప్పుడు ఆ నెలను ఆషాఢం అంటారు. ఈ నెల్లోనే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా ఆషాఢంలోనే వర్ష రుతువు కూడా మొదలవుతుంది. సాధారణంగా ఆషాఢాన్ని శూన్యమాసంగా పేర్కొంటూ ఎలాంటి శుభకార్యాలూ, వేడుకలూ చేయరు. కొత్తకోడలు సైతం మెట్టినింట్లో కాకుండా పుట్టింట్లోనే ఉండాలని అంటారు.

ఇలా ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టకపోయినా... ఈ మాసం పూజలూ, వ్రతాలూ చేసేందుకు అత్యంత ప్రత్యేకమైనదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారినీ, ఈశ్వరుడినీ, విష్ణుమూర్తినీ అర్చించాలని అంటారు. నిజానికి ఆదిపరాశక్తిని పూజించేందుకు ఏడాదిలో నాలుగు నవరాత్రులు ఉంటాయట. ఆ నవరాత్రులను మాఘ, చైత్ర, ఆశ్వయుజ మాసాలతోపాటూ ఆషాఢంలోనూ చేయాలని దేవీ భాగవతంలో ఉంది. అందుకే ఈ నెల మొత్తం తెలంగాణ ప్రాంతంలో సమస్త జగత్తుకూ మూలాధారమైన అమ్మవారిని బోనాల పేరుతో అంగరంగవైభవంగా పూజిస్తారు. అలాగే ఆషాఢ మాసంలో సముద్రతీరంలో చేసే స్నానం, జపం, పూజ... అన్నీ విశేష ఫలితాలను ఇస్తాయనీ అంటారు. దాంతోపాటు కుదిరితే... ఈ నెల్లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందనీ చెబుతారు.

జగన్నాథుడి రథయాత్ర...

ఈ నెల్లోనే హిందువుల మొదటి పండగ తొలి ఏకాదశి వస్తుంది. ఆ తరువాత నుంచి ప్రతి నెలలో పండగలు మొదలవుతాయనడానికి సంకేతమే తొలి ఏకాదశి. ఈ రోజున విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడనీ, తొలి ఏకాదశినాడు ఉపవాసం ఉంటే మంచిదనీ భక్తుల నమ్మకం. దీని తరువాత విశేషంగా జరిగే మరో పర్వదినం త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే గురు పూర్ణిమ. వేదవ్యాసుడి పుట్టినరోజైన ఈ శుభదినాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వీటితోపాటూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించే స్కంద పంచమి, కుమార షష్టి, భాను సప్తమి... వంటి రోజులనూ ఆషాఢంలో విశేషంగా జరుపుకుంటారు.

ఈ నెల్లోనే చాతుర్మాస వ్రతాన్నీ ప్రారంభిస్తారు. వీటన్నింటితోపాటూ ఈ నెల్లో పూరీ జగన్నాథుడి రథయాత్ర, పండరిపురంలో పాండురంగ విఠల్‌ పల్లకీ యాత్రను అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆషాఢ శుద్ధ విదియనాడు సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రల సహితుడై కొలువైన జగన్నాథుడితో రథయాత్ర ఉంటుంది. ఇందులో మూలవిరాట్టులే రథం మీద ఊరేగింపుగా తరలిరావడం విశేషం. ఈ యాత్రలో ఉపయోగించే రథాలను ఏ ఏటికాయేడు కొత్తగానే తయారుచేస్తారు. రథయాత్రకు రెండు రోజుల ముందుగా అమావాస్య నాడు విగ్రహాలకు నేత్రోత్సవం నిర్వహిస్తారు. అప్పటివరకూ చీకటి గదిలో ఉంచిన ఆ విగ్రహాలకు మరుసటి రోజునుంచీ యథావిధిగా పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ విదియ నాడు ఆ విగ్రహాలను కదిలించి రథాలమీద అలంకరింపజేస్తారు. దీన్నే బహుదాయాత్ర అనీ అంటారు. దీన్ని తొమ్మిది రోజుల పాటు కన్నులపండువగా నిర్వహిస్తారు.

పూరీ యాత్ర తరువాత చెప్పుకోవాల్సింది పాండురంగ విఠలుడి పల్లకీసేవ. తొలి ఏకాదశి నాడు... మహారాష్ట్రలోని పండరీపూర్‌లో కొలువైన పాండురంగడి పాదుకలను పల్లకీసేవ పేరుతో ఊరేగిస్తారు. ఆ పల్లకీ ఊరేగింపు దాదాపు 250 కిలోమీటర్ల వరకూ సాగుతుంది. ఈ ఊరేగింపును డిండీ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఊరేగింపుగా గిన్నిస్‌ రికార్డు కూడా నమోదైంది. ఇప్పటివరకూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ ఊరేగింపును ఆపలేదనీ అంటారు. ఆ సమయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలనూ నిర్వహించడం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఇలా నెల మొత్తం ఏదో ఒక పర్వదినంతో, ప్రత్యేక పూజలతో కొనసాగే ఆషాఢమాసాన్ని పూజల మాసం అనడంలో ఆశ్చర్యంలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.