ETV Bharat / state

కరోనా కట్టడికి ప్రత్యేక చెక్​పోస్టులు: మంత్రి ఈటల

కరోనా వైరస్​ నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని మంత్రిఈటల రాజేందర్​ తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయని, ఆ రాష్ట్రం నుంచి వచ్చే ప్రాంతాల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులతో వైద్య సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతుందని మంత్రి వివరించారు.

Special check posts for corona affected state border routes in telangana minister etela said
కరోనా కట్టడికి.. ప్రత్యేక చెక్‌పోస్టులు : మంత్రి ఈటల
author img

By

Published : Mar 16, 2020, 12:00 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్లపై నిఘా పెంచామని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి వెల్లడించారు.

ధర్మాబాద్, జహీరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, చందాపూర్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్ అమెరికా నుంచి వచ్చారని, ముందు జాగ్రత్తగా అరవింద్‌కుమార్‌కు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించామన్నారు.

ఇదీ చూడండి : సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.