గ్రేటర్‌లో 12 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. ప్రతినెలా మీటర్ రీడింగ్ నమోదు చేసేందుకు పెద్ద కసరత్తే జరుగుతోంది. ప్రైవేటు ఏజెన్సీలతో రీడింగ్ నమోదు, బిల్లులు జారీ చేస్తున్నారు. ఇందుకు ప్రతి బిల్లుపై నిర్ణీత కమీషన్‌ను లెక్కేసి ఏటా రూ.10-12 కోట్లు ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, రీడింగ్ నమోదులో పారదర్శకత లేదనే ఆరోపణలున్నాయి. చాలామంది అసలు ఇంటింటికి వెళ్లకుండానే అంతకుముందు నెలల రీడింగ్ ప్రకారం అంచనా నమోదు చేస్తున్నారు. కరోనా విజృంభణ తర్వాత ఈ నిర్లక్ష్యం మరింత పెరిగింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా రీడింగ్ నమోదు మానేశారు. దీంతో తక్కువ నీళ్లు వాడినా ఎక్కువ బిల్లు వస్తోందని నల్లాదారులు లబోదిబోమంటున్నారు. ఈ తరహా యాప్ ద్వారా మీటర్ రీడింగ్ నమోదును విద్యుత్తు శాఖలో కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
● యాప్ ద్వారా వినియోగదారులే నీటి రీడింగ్ నమోదు చేసుకోవచ్ఛు స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నీటి మీటర్‌పైన ఉన్న మూత పైకి లేపి యాప్‌లోని స్కానర్‌ను దగ్గరగా చూపిస్తే రీడింగ్‌ను స్కాన్ చేసి నమోదు చేస్తుంది.
● ఈ డేటా యాప్ ద్వారా జలమండలి సర్వర్‌కు చేరి వాడుకున్న నీటికి బిల్లు చూపిస్తుంది. యాప్‌లోనే బిల్లు కూడా చెల్లించొచ్ఛు చెల్లింపు తేదీని కూడా నోటిఫికేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. దీంతో బిల్లు చెల్లింపులో జాప్యం ఉండదు.
● ప్రస్తుతం ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో రీడింగ్ నమోదు కీలకం. 20 వేల లీటర్లకంటే ఎక్కువ చూపితే పథకం వర్తించదు.
● యాప్‌తో మీటర్ రీడింగ్ ఏజెన్సీల భారం తగ్గి జల మండలికి భారీగా నిధులు ఆదా అవుతాయి. పలు ఏజెన్సీలను కొందరు అధికారులే బినామీ పేర్లతో నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి.
జలమండలి సెల్ఫ్ బిల్లింగ్ యాప్
విద్యుత్తు మీటర్లకు అలా..
- విద్యుత్తు విషయంలో ప్రతి కనెక్షన్‌కు మీటరు ఉంటుంది. కొన్నిసార్లు రీడర్లు ఆలస్యంగా రావడంతో రీడింగ్ పెరిగి టారిఫ్ మారుతుంది. యూనిట్ రేటు మారిపోయి బిల్లులు తడిసి మోపెడతున్నాయి. యాప్‌తో విద్యుత్తు వినియోగదారులకు వెసులుబాటు ఉంటుంది.
- విద్యుత్తు మీటర్లు గోడకు అమర్చుతారు కాబట్టి యాప్‌తో స్కాన్ చేయడం సులువు.
ప్రస్తుతం ప్రభుత్వం నగరవ్యాప్తంగా ఉచితంగా నీటిని సరఫరా చేస్తోంది. మీటర్ రీడింగ్ 20 వేల లీటర్లకంటే ఎక్కువ చూపితే ఈ పథకం వర్తించదు.
- గ్రేటర్‌లో ఉన్న నల్లాలు 12 లక్షలు
- నీటి మీటరు ఉన్నవి 2.20 లక్షలు
- ఏటా ఏజెన్సీలకు చెల్లిస్తున్నది రూ.10-12 కోట్లు
ఉన్నవి 2.20 లక్షలే..
● నగరంలో చాలా నల్లాలకు మీటర్లే లేవు. 12 లక్షల నల్లాలుంటే 2.20 లక్షల మీటర్లే ఉన్నాయి. ఉచిత నీటి పథకంలో మీటరు తప్పనిసరి చేయడంతో క్రమంగా మీటర్ల పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 50 వేల మంది అమర్చుకున్నారు.
● నీటి మీటర్ ఛాంబర్ లోపల ఉంటుంది. దగ్గరగా వెళ్లి స్కాన్ చేయడం కొంత కష్టమే. ఈ సమస్యను అధిగమించడానికి దూరం నుంచి యాప్ చూపినా రీడింగ్ స్కాన్ అయ్యేలా మార్పులు చేస్తున్నారు.
● మురికివాడల్లో ఉన్న 1.96 లక్షల నల్లాలకు మీటర్లు అవసరం లేదని జల మండలి ఇప్పటికే ప్రకటించింది. ఆ నల్లాలను రీడింగ్ నుంచి పూర్తిగా మినహాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: Registrations: సాంకేతిక సమస్య పరిష్కారం... ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు