ETV Bharat / state

దక్షిణ మధ్య రైల్వేకు మూడు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు - హైదరాబాద్​ వార్తలు

దక్షిణ మధ్య రైల్వే మూడు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు దక్కించుకుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదలచేసింది. సంప్రదాయేతర విద్యుత్‌ను ఒడిసిపట్టడంలో వినూత్న పద్ధతులను అవలంభిస్తూ ఇంధనాలను పొదుపు చేసినట్లు పేర్కొంది.

south-central-railway-has-won-three-national-awards-in-energy-efficiency
దక్షిణ మధ్య రైల్వేకు మూడు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు
author img

By

Published : Dec 20, 2020, 3:56 PM IST

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డులో ఎస్‌సీఆర్‌ మూడు అవార్డులను కైవసం చేసుకుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలు, రైల్వే వర్క్‌షాప్స్‌ కేటగిరిలో విజయవాడ డీజల్‌ లోకో షెడ్‌ ప్రథమ బహుమతి, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల కేటగిరిలో లేఖా భవన్‌ (ఎస్​సీఆర్‌ అకౌంట్స్‌ కార్యాలయ భవనం) రెండవ బహుమతి, ట్రాన్స్‌పోర్ట్‌ / జోనల్‌ రైల్వేస్‌ కేటగిరిలో దక్షిణ మధ్య రైల్వే మెరిట్‌ సర్టిఫికేట్‌ పొందిందని అధికారులు వివరించారు.

ఇదీ చూడండి: ఇంధన పొదుపులో ద.మ.రైల్వే ప్రతిభ : జీఎం గజానన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.