Jawad Cyclone Effect on Trains : జవాద్.. తీవ్ర తుపానుగా మారి ముంచుకొస్తోంది. ఒడిశాలోని పారదీప్‌కు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో కొన్ని రైళ్లను రద్దు చేసింది.
ఈనెల 4న రద్దు చేసిన రైళ్లు ఇవే..
- హౌరా-హైదరాబాద్
- హౌరా-చెన్నై సెంట్రల్
- హౌరా-ఎర్నాకులం
- హౌరా-యశ్వంత్ పూర్
- హౌరా-వాస్కోడిగామా
- హౌరా-చెన్నై సెంట్రల్
- బిలాస్ పూర్-తిరుపతి
- దన్ బాద్-అల్లెప్పె
- సికింద్రాబాద్-హౌరా
- సికింద్రాబాద్-గౌహతి
- తిరుపతి-పూరీ
- విల్లుపురం-పురులియా
- సికింద్రాబాద్-భువనేశ్వర్
- చెన్నై సెంట్రల్-హౌరా
- కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్
- ముంబయి-సీఎస్టీ -భువనేశ్వర్
- గుంటూరు-రాయగడ
- అల్లెప్పీ-ధన్ బాద్
- తంబరం-జసిద్
ఈనెల 5న రద్దు చేసిన రైళ్లు ఇవే...
- భువనేశ్వర్-బెంగళూరు
- భువనేశ్వర్ -సికింద్రాబాద్
- పూరీ-ఓకా
- భువనేశ్వర్-తిరుపతి
- రాయగఢ్-గుంటూరు
- పూరీ-తిరుపతి
- పూరీ-చెన్నై సెంట్రల్
- భువనేశ్వర్-ముంబయి సీఎస్టీ
- తిరుపతి-భువనేశ్వర్
- చెన్నై సెంట్రల్-హౌరా
ఈనెల 6న యశ్వంత్ పూర్ -టాటా, ఈనెల 7న బెంగళూరు -హాతియా రైళ్లను రద్దు చేసినట్లు ద.మ.రైల్వే ప్రకటించింది.
ముంచుకొస్తున్న జవాద్
Jawad Cyclone IMD: తీవ్ర తుపానుగా మారిన 'జవాద్'.. ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 490 కిలోమీటర్ల దూరంలో... విశాఖకు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.
ఇదీ చదవండి: JAWAD CYCLONE EFFECT IN AP : తీవ్ర తుపానుగా జవాద్... రేపు తీరం దాటే అవకాశం
"జవాద్ తుపాను గోపాల్‌పుర్‌కు 340 కిలోమీటర్లు, పూరీకి 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయవ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకుని రానున్న 12గంటల్లో ఒడిశా పూరీ తీరానికి చేరుకుంటుంది. ఆదివారం రాత్రికి క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారుతుంది."
- భారత వాతావరణశాఖ
తుపాను ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఏపీ అప్రమత్తం..
Jawad Andhra Pradesh: జవాద్ తుపాను దృష్ట్యా.. 11ఎన్డీఆర్ఎఫ్, 5ఎస్డీఆర్ఎఫ్, 6 కోస్ట్ గార్డు, 10 మెరైన్ పోలీస్ బృందాలను మోహరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తీరప్రాంతంలోని 54,008 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. జవాద్ తుపాను కారణంగా ఆదివారం జరగనున్న యూజీసీ- నెట్, ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షలు ఒడిశా, ఏపీ, బంగాల్లోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో వాయిదా పడ్డాయి.
ఇదీ చదవండి: Jawad cyclone in AP: జవాద్ ఎఫెక్ట్.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు