అనారోగ్యంతో మరణించిన తల్లికి అంతిమ సంస్కారాలు చేయలేక పుట్పాట్పైనే వదిలి వెళ్లిన దీనస్థితి ఆ కుమారుడిది. దారిద్య్రం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకునేలా చేస్తుందనేందుకు ఈ ఘటనే సాక్ష్యం. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఈ కన్నీటి దృశ్యం చోటుచేసుకొంది.
అంతిమ సంస్కారాలకు డబ్బులులేక.. నలుగురిని పిలిచేందుకు ధైర్యం చాలక.. ఓ సంచిలో ఉంచి పుట్‌పాత్‌పైనే వదిలేశాడు. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న బతుకులను.. కరోనా రక్కసి ఎంత దారుణమైన స్థితికి తీసుకొచ్చిందో ఈ ఘటనే ఓ సజీవ సాక్ష్యమని చెప్పవచ్చు.
మూడు రోజులుగా తల్లి జ్వరంతో బాధపడుతున్నా.. ఏమీ చేయలేని స్థితిలో ఓ కుమారుడు ఉండిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే.. కరోనా అంటారేమోననో.. లేక వేలకు వేలు కట్టే స్తోమత లేకనో.. తన ఎదుటే కన్నతల్లి అవస్థలు పడుతున్నా.. ఇంట్లోనే ఉంచాడు.. కుమారుడు దీనస్థితిని చూడలేక.. ప్రాణాలు నిలుపుకోలేక ఆ తల్లి కన్నుమూసింది.
మృతురాలు స్థానిక ప్లాజాలో వాచ్‌మెన్‌గా పని చేసే రమేష్ తల్లిగా పోలీసులు గుర్తించారు. రమేష్ డబ్బులు లేక తల్లి మృతదేహన్ని ఫుట్‌పాత్‌పై ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బంజారాహిల్స్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం