రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి రామచంద్రాపురం మండలంలోని తండ్రి ద్విచక్ర వాహనం కొనిపెట్టలేదని కుమారుడు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బీహెచ్ఈఎల్ టౌన్ షిప్లో పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అనిల్‌ను ఆయన కుమారుడు రిషికేశ్ కొంత కాలంగా ద్విచక్ర వాహనం కొనివ్వాలని అడుగుతున్నాడు. వాహనం ఇప్పుడే వద్దని నచ్చ చెప్పిన తండ్రిపై అలిగిన రిషికేశ్ ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తమ కుమారుడు ఇంత పని చేస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు బోరుమన్నారు. ఎదిగి వచ్చిన కొడుకు కానరాని లోకానికి వెళ్లాడనే చేదు నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రామచంద్రపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : ఫాక్స్ సాగర్ చెరువులో చేపపిల్లల పంపిణీ