ETV Bharat / state

Doctors: అహోరాత్రులు పనిచేసిన వైద్యులకు కాస్త ఉపశమనం

తెలంగాణలో గత పది రోజులుగా కరోనా, బ్లాక్‌ఫంగస్‌ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా హోరులో అహోరాత్రులు పనిచేసిన వైద్యులకు ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగింది.

author img

By

Published : Jun 10, 2021, 10:31 AM IST

Doctors: అహోరాత్రులు పనిచేసిన వైద్యులకు కాస్త ఉపశమనం
Doctors: అహోరాత్రులు పనిచేసిన వైద్యులకు కాస్త ఉపశమనం

తెలంగాణ రాజధానిని కరోనా రెండో దశ ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రభుత్వ రంగంలో అయిదు ఆస్పత్రులు, ప్రైవేటు రంగంలో రెండు వేల చిన్నా పెద్దా వైద్యశాలలు కొవిడ్‌ చికిత్సలో కీలక పాత్ర పోషించాయి. భాగ్యనగరం మెడికల్‌ హబ్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగానూ, పక్క రాష్ట్రాల నుంచి బాధితులు వెల్లువలా వచ్చారు. వేలాది మంది తరలివస్తుండడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడాయి. ఒకరా.. ఇద్దరా.. ఏకంగా పది వేల మంది వైద్యులు.. అంతే సంఖ్యలో నర్సులు.. వైద్య సిబ్బంది మూడు నెలలపాటు అహోరాత్రులు పని చేశారు. కుటుంబీకులు కరోనా బారిన పడినా, బంధువులు మరణించినా.. బాధను దిగమింగారే కానీ విధులపై ప్రభావం పడనివ్వలేదు. లక్షలాది మంది కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులను కంటికి రెప్పలా కాపాడారు. మృత్యువుకు దగ్గరైన వారికి ధైర్యం నూరిపోసి ప్రాణాలు నిలబెట్టారు. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ తగ్గుముఖం పట్టిన వేళ నగర వైద్య విభాగం ఊపిరి పీల్చుకుంటోంది. కొద్ది రోజులైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు.

‘గాంధీ’ వైద్య సేవలు అమూల్యం:

1850 పడకలున్న ఈ పెద్దాసుపత్రిలో వైద్య కళాశాల డాక్టర్లు, పీజీలు కలిపి వెయ్యి మంది వైద్యులున్నారు. అంతేస్థాయిలో నర్సులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. మొదటి దశలో దాదాపు అయిదారు నెలలు ఈ ఆస్పత్రి కీలక పాత్ర పోషించింది. రెండో దశలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండడంతో అందరూ 24 గంటలపాటు పని చేశారు. దాదాపు 60 వేల మంది బాధితులను పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు పంపారు. మూడు నెలలపాటు సెలవులు తీసుకోలేదు.

టిమ్స్‌, కింగ్‌కోఠి, ఛాతీ, ఫీవర్‌ ఆస్పత్రులు:

గత ఏడాది పురుడు పోసుకున్న గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అవసరమైనంత మంది లేరు. ఉన్నవారే వేలాదిమంది బాధితులకు నయం చేయగలిగారు. మిగతా మూడు ప్రభుత్వ దవాఖానాల్లోనూ వైద్యులు, సిబ్బంది నిద్రాహారాలు మాని పని చేశారు.

ప్రైవేటు ఆస్పత్రులు:

ఇక్కడి వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో సేవలందించారు. బిల్లుల విషయంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలపై పలు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. కానీ అక్కడ పనిచేసిన వైద్యులు, వైద్యసిబ్బంది రోగులను కంటికి రెప్పలా కాపాడి వేలాది మందికి ఊపిరులూదారు. కంటిపై కునుకులేకుండా పని చేశారు.

- డాక్టర్‌ రాజారావు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

గత కొన్ని నెలలుగా వైద్యులు, నర్సింగ్‌, సహాయక సిబ్బంది అహోరాత్రులు పని చేశారు. ఏ ఒక్కరూ సెలవులు తీసుకోలేదు. చాలా మంది కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. వేలాది మంది రోగుల ప్రాణాలు నిలపడంలో అందరి కృషి ఉంది. ఇదో ఆత్మసంతృప్తి.

300 మందికి సోకింది

కరోనా రెండో దశలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు 300 మంది వైద్యులు, నర్సులు మహమ్మారి బారినపడ్డారు. నలుగురు వైద్యులు, ఆరుగురు నర్సులు ప్రాణాలొదిలారు. రెండో దశ నాటికి వంద శాతం టీకాలు వేయించుకోవడం వల్ల ధైర్యంగా విధుల్లో పాల్గొన్నారు.

బాధితుల సంఖ్య భారీగా తగ్గుముఖం

గత పది రోజులుగా కరోనా, బ్లాక్‌ఫంగస్‌ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉద్ధృతిలో గాంధీలో రోజూ 200 మంది చేరితే ఇప్పుడు 50కి మించడం లేదు. ప్రస్తుతం 200 పడకలు ఖాళీగా ఉన్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. టిమ్స్‌ ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇలానే ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో 40-50 శాతం పడకలు ఖాళీ అయ్యాయి. ఆమేరకు వైద్యులపై ఒత్తిడీ తగ్గింది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు డాక్టర్లకు, నర్సులకు విశ్రాంతి సెలవులు ఇస్తున్నాయి. మూడో దశ ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సంసిద్ధులను చేస్తున్నారు.

ఇదీ చదవండి : Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.