ETV Bharat / state

హైదరాబాద్​లో 500 మంది కరోనా రోగులు  కనిపించడం లేదు! - corona fake address

కరోనా పరీక్షలు చేయించుకుంటున్న కొందరు తప్పడు చిరునామాలు ఇస్తున్నారు. దీంతో వైరస్ సోకిన వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. హైదరాబాద్​లోనే దాదాపుగా పాజిటివ్ వచ్చిన 500 మంది ఆచూకీ లేదు. పరీక్షలు చేయించుకున్నప్పడు తప్పుడు చిరునామా ఇవ్వడమే ఇందుకు కారణం.

corona
corona
author img

By

Published : Jun 30, 2020, 9:32 AM IST

వైరస్‌ సోకిన వ్యక్తితోపాటు.. కలివిడిగా మెలిగిన వారందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. హైదరాబాద్​లో పాజిటివ్‌ అని తేలిన 500 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు. వారంతా ఎక్కడున్నారు.. ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియట్లేదు. పరీక్షలు చేయించుకునేటప్పుడు నకిలీ పేరు, తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్లు ఇవ్వడమే అందుకు కారణం. కొందరు పాజిటివ్‌ అని తేలిన రెండు, మూడు రోజులకు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తున్నారని, కొందరు వారం దాటినా అందుబాటులోకి రావట్లేదని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

స్పష్టత లేని సమాచారంతో..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వం రోజుకు 3 వేల మేర నమూనాలు పరీక్షిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పరీక్ష కేంద్రాలు, ప్రైవేటు ల్యాబ్‌ల్లో ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేటు లాబ్‌ల ముందు ఉదయం నుంచే జనం వరుసలో నిలబడి కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. పోలీసులు, జర్నలిస్టులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిబిరాల్లో నమూనాలు తీసుకుంది. ఆక్రమంలో అభ్యర్థులు ఓ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అందులో పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌ నంబరు, ఆధార్‌ సంఖ్య, వ్యాధి లక్షణాలను పొందుపరచాలి. ఆ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కాలేదు.

సమాజానికి భయపడుతున్నారా?

పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు తేలితే ఇరుగుపొరుగు వింతగా చూస్తారు.. అద్దె ఇల్లు అయితే యజమాని ఖాళీ చేయిస్తారు.. ఉన్నతాధికారులు విధులకు దూరంగా ఉంచుతారు.. సంస్థ ఉద్యోగం నుంచి తొలగిస్తుంది..ఇలాంటి అపోహలతో చాలామంది పరీక్షలు చేయించుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా ఇస్తున్నారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఉంటూ సొంతంగా వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు.

కొందరు వ్యాధి లక్షణాలు తీవ్రమైనప్పుడు సంప్రదిస్తున్నారని, అలాంటి వారిని గాంధీకి తరలిస్తున్నామని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు. అదే సమయంలో దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అభ్యర్థుల నుంచి నమూనాలు తీసుకోవాల్సిందిగా ప్రైవేటు, ప్రభుత్వ పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.