దిశ ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ చౌరస్తాలో పలు కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారం నిర్వహించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్షించాలని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.
అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ శ్రీ సాయి విజ్ఞాన భారతి కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి పద్మారావునగర్ పార్క్ వరకు వెయి మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. దిశ ఘటనలోని నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: