ఫేక్ ఆధారాలతో యువతను, ఉద్యోగులను టార్గెట్ చేసిన క్యూనెట్ కుంభకోణం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలితీసుకుంది. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అరవింద్ క్యూనెట్ కుంభకోణంలో సుమారు 20 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. గతంలో క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్లో పలు కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: బ్రేకింగ్ న్యూస్: "కాఫీ డే" సిద్ధార్థ మృతి