ETV Bharat / state

Ganza Smugglers: గంజాయి సరఫరాలో ‘పుష్ప’ ఎత్తులు! - Ganza Supply News

Ganza Smugglers: పుష్ప సినిమాలో ఎర్రచందనం తరలించడానికి ఎలాంటి ఎత్తులు వేశారో.... గంజాయి స్మగర్లు కూడా అదే దారిలో నడుస్తున్నారు. పోలీసులు కళ్లుగప్పి సరకు తరలించేందుకు ఎంతటికైనా తెగిస్తున్నారు. పోలీసు, ప్రెస్‌ అని కార్లపై స్టిక్కర్లు అంటించి బురిడీ కొట్టిస్తున్నారు. గంజాయి తరలించేందుకు ఒక్కో కారు డ్రైవర్‌కు రోజుకు 40వేలు చెల్లిస్తున్నారు.

Ganza
Ganza
author img

By

Published : Mar 31, 2022, 5:04 PM IST

గంజాయి సరఫరాలో ‘పుష్ప’ ఎత్తులు!

Ganza Smugglers: గంజాయి స్మగ్లర్లు సరుకు తరలించడానికి కొత్తకొత్త మార్గాలు వెతుకున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌... పోలీసుల కళ్లు కప్పి ఎర్రచందనం తరలించడానికి ఎన్ని ఎత్తులు వేశాడో చూశాం. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి తెలంగాణకు గంజాయి సరఫరాకు చేసేందుకు స్మగ్లర్లు కూడా అదే బాటలో వెళ్తున్నారు. మార్గమధ్యలో పోలీసులు కన్నుగప్పేందుకు.... ఖరీదైన కార్లు వాడుతూ వాటిపై పోలీసు, ప్రెస్‌ అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు కూరగాయలు, అల్లం, పసుపు, పశువులు, ఎరువును రవాణా చేస్తున్నట్టు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Ganza
వాహనాల్లో తరలిస్తుండగా పట్టివేత

ఆ రాష్ట్రాల్లో డిమాండ్: మహారాష్ట్ర, కర్ణాటకల్లో మత్తుపదార్థాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముంబయి, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల గంజాయి రూ. 2,000 నుంచి రూ. 3,000 ఇచ్చి మరీ కొనుగోలు చేసేవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపటంతో సరఫరాకు అడ్డుకట్ట పడింది. ఖాకీల తనిఖీలు తప్పించుకుని సరుకు గమ్యం చేర్చటం... గంజాయి స్మగ్లర్లకు సవాల్‌గా మారింది. సరఫరా తగ్గిపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటకలో గంజాయికి డిమాండ్‌ పెరిగిపోయింది. కిలో గంజాయి రూ. 30 వేల వరకూ పలుకుతోంది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు మహారాష్ట్ర వ్యాపారులు రంగంలోకి దిగారు. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో గంజాయి రవాణా చేసి అరెస్టైన పాతనేరస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వారి ద్వారా ఏవోబీ, విశాఖ, రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి సరుకు రవాణా చేసేందుకు పెద్దమొత్తంలో ఆఫర్‌ చేస్తున్నారు.

Ganza
Ganza

మహబూబ్‌నగర్‌కు చెందిన 10 మంది ఇటీవల రెండు కార్లలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు -ఏవోబీకి వెళ్లి 100 కిలోల సరుకుతో బయల్దేరారు. చౌటుప్పల్‌ వద్ద రాచకొండ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు తమకు ఆర్డరిచ్చారని... సరుకు జహీరాబాద్‌ చేర్చితే చాలని చెప్పినట్లు పోలీసులకు తెలిపారు. ఒక్కో కారు డ్రైవర్‌కు కేవలం రెండ్రోజులకే రూ.40 వేలు కిరాయి ముట్టజెప్పారు.

100 కిలోలు దాటితే: ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి చేరేంత వరకూ పాత మొబైల్‌ఫోన్ల ద్వారానే సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు. 1 నుంచి 2 కిలోల వరకూ రైలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను వినియోగించుకుంటారు. 100 కిలోల నుంచి ఖరీదైన కార్లు, డీసీఎం, ట్యాంకర్లను ఎక్కువ కిరాయికి తీసుకుంటారు. గంజాయి కొనేందుకు వచ్చే ఏ ఒక్కరికీ అసలు ప్రదేశానికి తీసుకెళ్లరు. రాజమండ్రి, విశాఖపట్టణం, కొత్తగూడెం, భద్రాచలం అటవీ ప్రాంతాల్లో సరుకును వాహనాల్లోకి చేర్చుతారు. అర్ధరాత్రి తరువాత పక్కా ఏర్పాట్లతో వాహనాలు బయల్దేరతాయి. టోల్‌ప్లాజా, చెక్‌పోస్టుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారుల్లో ప్రయాణిస్తూ హైదరాబాద్‌ చేరతారు. ఔటర్‌ రింగురోడ్డు, కూకట్‌పల్లి మీదుగా సరుకును జహీరాబాద్‌ చేర్చుతారు.

ఎవరికీ అనుమానం రాకుండా: జహీరాబాద్‌ చేరిన గంజాయిను అటవీ, కొండ ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు చేరవేస్తున్నారు. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, కార్లలో గంజాయి ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పెళ్లి బృందాలు, శవయాత్రల తరలింపు ముసుగులో జహీరాబాద్‌ నుంచి తేలికగా ముంబయి, బీదర్, గుల్బర్గా, నాందేడ్‌ షోలాపూర్‌ తదితర ప్రాంతాలకు చేర్చుతున్నట్టు గుర్తించామని సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. జహీరాబాద్, మెదక్, నారాయణ్‌ఖేడ్‌ల్లోని కొందరు వ్యక్తులు కమీషన్‌ కోసం మహారాష్ట్ర స్మగ్లర్లకు ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి: Ganja seized: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.