ETV Bharat / state

60 సెకన్లలో గాఢ నిద్ర - చంటి పాపలా పడుకుంటారంతే! - Sleeping Problem tips

Sleeping Problem tips : రోజూ నిద్రకోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారా? రాత్రివేళ 11 గంటల నుంచి స్ట్రగుల్ మొదలు పెడితే.. ఏ రెండు, మూడు గంటలకో కళ్లు మూతపడుతున్నాయా? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదా? డోంట్ వర్రీ.. 4-7-8 ఫార్ములా ఫాలో అయితే చాలు.. అతి త్వరలో నిమిషంలో నిద్రపోయే స్టేజ్​కు వచ్చేస్తారు!

Sleeping Problem tips
Sleeping Problem tips
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 3:46 PM IST

How to Sleep Fast : మనిషికి గాలి, నీరు తర్వాత మూడో అతి ముఖ్యమైనది నిద్ర. రాత్రివేళ చక్కగా నిద్రపోతేనే.. మరుసటి రోజు ఉత్సాహంగా మొదలవుతుంది. నిద్ర తేడాకొట్టిందంటే మాత్రం.. తప్పకుండా ఆ ఎఫెక్ట్ రోజంతా కనిపిస్తుంది. అయితే.. పలు రకాల కారణాలతో త్వరగా నిద్రరాక చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతుంటారు. బెడ్ మీదకు చేరిన తర్వాత.. నిద్ర కోసం యుద్ధమే చేస్తుంటారు. కళ్లు మూసుకుంటారు.. అటూ ఇటూ దొర్లుతారు.. పలుమార్లు బెడ్ మీద నుంచి లేస్తారు.. ఇలా సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఎప్పటికో నిద్రపడుతుంది. ఈ ఆరాటం కొందరిలో కొన్ని గంటలపాటు సాగుతుందంటే అతిశయోక్తి కాదు.

ఇందుకు అనారోగ్య కారణాలు మొదలు.. అనునిత్యం కొనసాగే ఆందోళనలు.. మానసిక అలజడి వరకు కారణాలుగా ఉంటాయి. మరికొందరు రాత్రివేళ గంటల తరబడి ఫోన్ చూసీ చూసీ.. నిద్రలేమి సమస్యలు కొనితెచ్చుకుంటారు. ఈ ఎఫెక్ట్ ఆరోగ్యం మీద పడి మరింతగా ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. మేం చెప్పే టిప్స్ పాటిస్తే చాలు.. కేవలం 60 సెకన్లలో చంటి పిల్లల్లా నిద్రపోతారు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫస్ట్ ఇవి చేయండి..

ముందుగా.. చేయాల్సింది పైన చెప్పిన అనవసర అలవాట్లను వెంటనే మానేయండి. ఫోన్​తో దోస్తానా బెడ్ మీదకు వెళ్లడానికి ముందే. మీరు నిద్ర సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి.. ఒక్కసారి బెడ్ ఎక్కామంటే ఫోన్ ముట్టుకోవద్దు. సైలెంట్ మోడ్​లో పెట్టండి. దీంతోపాటు.. రోజుకు ఒకే సమయానికి నిద్రపోవాలని బలమైన నిర్ణయం తీసుకోండి. ఒక టైమ్ సెట్ చేసుకోండి. వీటితోపాటు కొన్ని టిప్స్ పాటించండి.

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్..

నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా పాటించాలంటే..

స్టెప్ 1 : బెడ్ మీద మీరు పడుకోవడానికి అనువైన ప్లేస్​ను సెలక్ట్ చేసుకోండి. రెండు మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని.. రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీలవండి.

స్టెప్ 2: ఇప్పుడు మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తున్నట్టుగా అన్ని పార్టులనూ ఫ్రీగా వదిలేయండి. కాసేపటి తర్వాత ప్రశాంతంగా కళ్లు మూసుకోండి. ఒంట్లోని మజిల్స్​లో ఏదైనా ఒత్తిడి మిగిలి ఉంటే.. మొత్తం వదిలేయండి. ఆలోచనలన్నీ వదిలేయండి. ఇక్కడ మీరు ఎంత ప్రయత్నిస్తున్నా.. మరో ఆలోచన వస్తూనే ఉంటుంది. అప్పుడు రానివ్వండి.. ఎన్ని వస్తాయో అన్ని రానివ్వండి.. ఆ తర్వాత ఆగిపోతుంటాయి.

స్టెప్ 3: ఇప్పుడు ముక్కు ద్వారా లోతైన శ్వాస నెమ్మదిగా తీసుకోండి. 4 సెకన్లపాటు శ్వాస తీసుకోవాలి. నిశ్శబ్ధంగా మనసులో లెక్కించండి. ఇప్పుడు మీ ఊపిరితిత్తుల్లో గాలి నిండి.. మీ పొత్తికడుపు పెద్దగా అవుతున్న అనుభూతి చెందండి.

స్టెప్ 4: నాలుగు సెకన్లపాటు తీసుకున్న శ్వాసను అలాగే బంధించండి. 7 సెకన్లపాటు ఇలా బంధించి ఉంచండి. నోరు మూసుకుని, మీ నాలుకను పైదంతాలకు ఆనుకొని రిలాక్స్ కానివ్వండి. ఈ సమయంలో మీ శరీరంలోని పవర్​ను ఫీలవ్వండి.

స్టెప్ 5: ఏడు సెకన్ల టైమ్ ముగిసిన తర్వాత మెల్లగా శ్వాసను నోటితో వదలాలి. అయితే ఒకేసారి వదిలేయకుండా.. 8 సెకన్ల పాటు మెల్లగా వదిలేయాలి. ఈ సమయంలో మీ శరీరంలోని ఒత్తిడి మొత్తం వదిలిపోతున్న అనుభూతిని ఫీలవ్వండి. కొత్తవారు నాలుగు సార్లు చేయాలి. అనుభవం ఉన్నవారు 12సార్లు చేయవచ్చు.

వీటితోపాటుగా..

సాయంత్రం తర్వాత టీ, కాఫీ లాంటివి తాగకూడదు. తిండి హెవీగా తినకుండా చూసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. బెడ్ మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పక్కాగా పాటిస్తే.. మీ నిద్రసమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కేవలం 60 సెకన్లలోనే మీ డ్రీమ్‌ల్యాండ్‌లో ల్యాండ్ అయ్యే స్టేజ్​కు తప్పక చేరుకుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.