ETV Bharat / state

కెరీర్​లో వేగంగా ఎదగాలంటే.. ‌ఈ మెలకువలు తెలుసుకోండి.. - planning

కొంతమంది కెరీర్‌లో రాకెట్‌లా దూసుకుపోతుంటే... మరికొందరు మాత్రం వరుస వైఫల్యాలతో విసిగిపోతుంటారు. దానికి కారణం.. వృత్తిపరంగా కొన్ని నైపుణ్యాలు తెలియకపోవడమే. ఆ మెలకువలేంటో తెలుసుకుంటే మీరూ మీ వృత్తిలో వేగంగా పైపైకి వెళ్లొచ్చు.

Skills to grow faster in career
కెరీర్​లో వేగంగా ఎదగాలంటే.. ‌ఈ మెలకులు తెలుసుకోండి..
author img

By

Published : Sep 7, 2020, 9:58 AM IST

చొరవ:

‘నా పనేదో నేను’.. అనుకుంటూ కొన్ని పరిధుల మధ్యలో పనిచేసే వాళ్లతో పోలిస్తే... చొరవ చూపిస్తూ అవకాశాలు దక్కించుకునేవాళ్లు కెరీర్‌లో చాలా వేగంగా ముందుకు వెళ్లగలుగుతారని కెరీర్‌ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు చొరవతీసుకోవడం, సమస్యలకు తగిన సలహాలు ఇవ్వడం వంటివన్నీ బృందంలో మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుపుతాయి.

నేర్చుకోవడం ఆపేయొద్దు:

మీ ఆఫీస్‌ పని మీకు కొట్టిన పిండే. అంతమాత్రాన నేర్చుకోవడం ఆపేయొద్ధు అలా చేస్తే... మీ పనిలో కొత్తదనం కనిపించదు. మీ వ్యక్తిగత అభిరుచులు, లేదా మీ పనికి సంబంధించిన అడ్వాన్స్డ్‌ నైపుణ్యాల కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. అప్పుడు చేసే పనిలో బోర్‌ ఉండదు. కొత్తదనం కనిపిస్తుంది. మీకు ప్రాధాన్యమూ ఉంటుంది.

ప్రణాళిక ఉందా?:

సాఫీగా సాగిపోతుంది కదాని కెరీర్‌ పట్ల ప్రణాళిక లేకుండా ఉండకూడదు. వాస్తవ పరిస్థితులు అంచనా వేసుకుంటూ...అవసరమైన మార్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందంటారు నిపుణులు.

ఇవీ చూడండి: సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.