ETV Bharat / state

High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఆరుగురు అధికారులకు జైలు శిక్ష - contempt of court

కోర్టు ధిక్కరణ కేసులో ఆరుగురు అధికారులకు 6 నెలల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ... హైకోర్టు తీర్పునిచ్చింది. వీరిలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి.... రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌తోపాటు ఇతర అధికారులు ఉన్నారు.

High Court
కోర్టు
author img

By

Published : Aug 1, 2021, 5:04 AM IST

కోర్టు ధిక్కరణ కేసులో ఆరుగురు అధికారులకు 6 నెలల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ... హైకోర్టు (High Court) తీర్పునిచ్చింది. వీరిలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి.... రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌తోపాటు... ఐఎఫ్​ఎస్ (IFS) అధికారులు శోభ, సునీత, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి జానకిరాం ఉన్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని 383 ఎకరాల భూమిని రిజర్వు ఫారెస్ట్‌గా మార్చాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని... 2008లో ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్ అధికారి... రంగారెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని... లేదంటే ప్రత్యామ్నాయంగా భూమిని వారికి అప్పగించాలంటూ.... 2009లో న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అమలు చేయలేదని పది మంది వ్యక్తులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.... విచారణ జరిపి తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి: Friendship: స్నేహ బంధానికి టెక్నాలజీ వేదికైతే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.