ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర’ కేసులో మలుపు.. ముగ్గురికి సిట్ నోటిసులు - తెలంగాణ న్యూస్

The Case of Baiting MLAs Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ బృందం వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే తుషార్​కి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు,కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది

'ఎమ్మెల్యేల ఎర’ కేసులో మలుపు.. ముగ్గురికి సిట్ నోటిసులు

author img

By

Published : Nov 18, 2022, 10:06 AM IST

Updated : Nov 18, 2022, 10:14 AM IST

The Case of Baiting MLAs Updates: ఎమ్మెల్యే ఎర కేసులో కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్యకళాశాలలో పనిచేస్తున్న జగ్గు ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే జగ్గుస్వామి పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకొని పరారయ్యాడు.

జగ్గుస్వామి ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన హాజరుకావాలని పేర్కొన్నారు.

BDJS అధ్యక్షుడు తుషార్ కు సైతం సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 5రోజుల పాటు కేరళలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు హైదరాబాద్ తిరిగి వచ్చారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు కేరళ వెళ్లి దర్యాప్తు చేశారు. కరీంనగర్ చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాంచంద్రభారతికి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కు మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది.

జగ్గుస్వామి, తుషార్ ను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. సింహయాజీ స్వామిజీకి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి న్యాయవాది శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు గుర్తించారు. వీళ్లిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది.. ఎవరైనా చెబితే టికెట్ బుక్ చేశారా అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు...

ఇవీ చదవండి:

Last Updated : Nov 18, 2022, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.